‘కేసీఆర్ విర్రవీగారు.. అందుకే ఓడిపోయారు’..
చంద్రబాబు చేసిన అసందర్భోచిత వ్యాఖ్యలు
అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించింది..
విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపింది..
.. మరిచావా చంద్రబాబు?
దాన్ని కదా విర్రవీగడం అంటారు!
విజనరీని అని తరచూ చెప్పుకునే చంద్రబాబులో అసహనం.. అహంకారం.. నోటి దురుసు చాలానే ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో తన వాచాలత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కేసీఆర్ అహంకారం, విర్రవీగడమే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటన పేరిట ఆయన బహిరంగసభల్లో ఇలా మాట్లాడారు..
విర్రవీగితే తెలంగాణ మాదిరిగా జరుగుతుంది అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరి చంద్రబాబు రెండుసార్లు ఓడియారు కదా!. అంటే దానర్థం.. అలా విర్రవీగినందుకే ఓడిపోయారనా?.. ఇది ఏమాత్రం ఆయనకు స్ఫురణ లేకపోవడం గమనార్హం.
చంద్రబాబు.. ప్రజలమీద, ఇతరనాయకుల మీద ఇలా ఇష్టానుసారం నోరుపారేసుకోవడం ఇది తొలిసారి కాదు.. ఇప్పటికే ఎన్నోసార్లు జరిగింది. ‘‘మాకు వేతనాలు పెంచాలి..’’ అని అడిగేందుకు వచ్చిన విశ్వబ్రాహ్మణులను.. ‘నన్ను డిమాండ్ చేస్తే తోకలు కట్ చేస్తా’ అని గద్దించిన సందర్భం ఒక ఉదాహరణ మాత్రమే. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు విర్రవీగినంతగా దేశంలో మరే నాయకుడూ చెలరేగిపోలేదు. ఇప్పుడేమో బీఆర్‌ఎస్ విర్రవీగినందుకే ఓడిందంటూ.. అంటూ స్టేట్‌మెంట్ ఇవ్వడం బాబుకే చెల్లింది.
చంద్రబాబుకు అధికారం ఉన్నపుడు లోకం, కళ్లు కానవచ్చేవి కావని రాజకీయ ప్రత్యర్థులు తిట్టిపోస్తుంటారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడేమో పొరుగురాష్ట్రాల నాయకులను ఇలా చిన్నచూపు చూసి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. విద్యుత్ ఆందోళనకారులను తుపాకులతో కాల్పులు జరిపి నేల కూల్చడం.. జీతాల కోసం ధర్నాచేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి హింసించడం.. మరి వీటిని ఏమంటారో? విర్రవీగడం, అధికార మదంతో చేసిన చేష్టలు అని అనకుండా ఉండగలరా?.. ఇవన్నీ మర్చిపోయి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఓ వ్యక్తిపై ఇలా అసందర్బోచిత వ్యాఖ్యలు చేయడం.. సెల్ఫ్ గోల్‌తో విమర్శలు ఎదుర్కోవడం కేవలం చంద్రబాబుకే చెల్లుతుందేమో!.
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment