ఆంధ్ర 203 ఆలౌట్ | Andhra 203 all out | Sakshi
Sakshi News home page

ఆంధ్ర 203 ఆలౌట్

Published Sun, Nov 8 2015 2:29 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

Andhra 203 all out

తమిళనాడుతో రంజీ మ్యాచ్
చెన్నై: తమిళనాడుతో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి రోజే కుప్పకూలింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ప్రదీప్ (159 బంతుల్లో 78; 6 ఫోర్లు; 1 సిక్స్), భరత్ (123 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా రికీ భుయ్ (65 బంతుల్లో 35; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. చంద్రశేఖర్‌కు నాలుగు, రంగరాజన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడు ఒక ఓవర్ ఆడగా పరుగులేమీ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement