హైదరాబాద్ 244/5
ఉత్తరాఖండ్ 325
రంజీ మ్యాచ్
డెహ్రాడూన్: మిడిలార్డర్ రాణించడంతో ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (174 బంతుల్లో 82 బ్యాటింగ్; 9 ఫోర్లు), కొడిమేల హిమతేజ (147 బంతుల్లో 78; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో రాణించారు.
ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (30; 4 ఫోర్లు), కెప్టెన్ రాహుల్ సింగ్ (21; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించగా... అభిరత్ రెడ్డి (0), రోహిత్ రాయుడు (7) విఫలమయ్యారు. ఉత్తరాఖండ్ బౌలర్లు రాణించడంతో తొలి ఓవర్‌లోనే హైదరాబాద్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బంతికే అభిరత్ రెడ్డి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పడటంతో ఒక దశలో హైదరాబాద్ 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో హిమతేజ, రాహుల్ రాధేశ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ జంట ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించడంతో హైదరాబాద్ జట్టు కోలుకోగలిగింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో దేవేంద్రసింగ్ బోరా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 313/8తో శనివారం తొల ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ చివరకు 325 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 4 వికెట్లు పడగొట్టగా... మిలింద్, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్న హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 81 పరుగులు వెనుకబడి ఉంది. రాహుల్ రాధేశ్‌తో పాటు తనయ్ త్యాగరాజన్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్: 325;
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) దేవేంద్రసింగ్ బోరా 30; అభిరత్ రెడ్డి (సి) ఆదిత్య (బి) దీపక్ ధాపోలా 0; రాహుల్ సింగ్ (సి) వైభవ్ భట్ (బి) అభయ్ నేగీ 21; రోహిత్ రాయుడు (ఎల్బీడబ్ల్యూ) ఆకాశ్ మధ్వాల్ 7; హిమతేజ (సి) అవనీశ్ సుధ (బి) దేవేంద్రసింగ్ బోరా 78; రాహుల్ రాధేశ్ (నాటౌట్) 82; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (78 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–1, 2–39, 3–53, 4–64, 5–206, బౌలింగ్: దీపక్ ధాపోలా 13–2–31–1; ఆకాశ్ మధ్వాల్ 10–0–41–1; అభయ్ నేగీ 16–2–40–1; దేవేంద్ర సింగ్ బోరా 15–1–51–2; అవనీశ్ సుధ 10–2–21–0; స్వప్నిల్ సింగ్ 13–3–46–0; రవికుమార్ సమర్‌్థ1–0–6–0.
Comments
Please login to add a commentAdd a comment