
న్యూఢిల్లీ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటై... ఫాలోఆన్‌లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పో యి 20 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే హైదరాబాద్ ఇంకా 195 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 269/6తో రెండో రోజు ఆట కొనసాగించిన ఢిల్లీ 71.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ అక్షత్ రెడ్డి (0) గోల్డెన్ డక్‌తో ఆరంభమైన హైదరాబాద్ పతనం రవి కిరణ్ (0) వరకు నిరాటంకంగా కొనసాగింది. హైదరాబాద్ టాప్ స్కోర్ సందీప్ చేసిన 16 పరుగులు కావడం గమనార్హం.