90 పరుగులకే కుప్పకూలింది! | Aravind helps Karnataka rout Delhi for 90 | Sakshi
Sakshi News home page

90 పరుగులకే కుప్పకూలింది!

Published Fri, Oct 21 2016 1:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

90 పరుగులకే కుప్పకూలింది!

90 పరుగులకే కుప్పకూలింది!

కోల్ కతా: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో  ఢిల్లీ విలవిల్లాడింది. గ్రూప్ -బిలో గురువారం ఆరంభమైన మ్యాచ్లో ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో 35.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.  టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్(0), గౌతం గంభీర్(2) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. అలా మొదలైన ఢిల్లీ పతనం కడవరకూ కొనసాగింది. అయితే మధ్యలో రిషబ్ పంత్(24), షోరే(24)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. ఏడుగురు ఢిల్లీ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఆ జట్టు స్వల్ప పరుగులకే పరిమితమైంది.

కర్ణాటక బౌలర్లు ఎస్ అరవింద్ నాలుగు వికెట్లు, గౌతమ్ మూడు వికెట్లు, మిథున్ రెండు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా శుక్రవారం రెండో రోజు లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement