లక్నో:హైదరాబాద్-ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్-సిలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే కుప్పకూలిన ఆంధ్ర.. ఆ తరువాత హైదరాబాద్ను 143 పరుగులకే కట్టడి చేసింది. 81/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ మరో 62 పరుగులు సాధించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.హైదరాబాద్ ఇన్నింగ్స్ లో చామా మిలింద్(29 నాటౌట్) దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ నాలుగు వికెట్లు సాధించగా,శివ కుమార్, భార్గవ్ భట్లు తలో రెండు వికెట్లు సాధించారు.
ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అవుతాయి. హైదరాబాద్ ప్రస్తుతం 30 పాయింట్లతో నాకౌట్‌కు బాగా చేరువలో ఉంది. చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడిస్తే హనుమ విహారి నాయకత్వంలో ఆడుతోన్న ఆంధ్ర (ప్రస్తుతం 25 పాయింట్లు) జట్టుకూ ఆ అవకాశం ఉంటుంది. అయితే వీరికి పోటీగా 25 పాయింట్లతో ఉన్న హరియాణా, తమ చివరి మ్యాచ్‌లో త్రిపురలాంటి బలహీన జట్టుతో ఆడుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. హైదరాబాద్‌ను ఆంధ్ర ఓడించి, మరోవైపు హరియాణా గెలవకుండా ఉంటే... హైదరాబాద్, ఆంధ్ర కలిసి ముందుకు దూసుకెళతాయి.
హోరాహోరీగా హైదరాబాద్-ఆంధ్ర మ్యాచ్
Published Fri, Dec 9 2016 1:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement