హైదరాబాద్ లక్ష్యం 219
ప్రస్తుతం 13/1
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్
లక్నో: రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లకు సహకరిస్తున్న ఈ పిచ్‌పై ఇది కష్టసాధ్యమైన లక్ష్యమే కాగా... దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మూడో రోజు ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్‌సలో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (9) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (2 బ్యాటింగ్), బి. అనిరుధ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్రకే ఆధిక్యం
మూడో రోజు ఆటలో ఆంధ్ర ఆటగాళ్లే పైచేయి సాధించారు. ముందుగా బౌలర్లు... శుక్రవారం 81/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను తొలి ఇన్నింగ్‌సలో 74.5 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌట్ చేశారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో ఆంధ్రకు తొలి ఇన్నింగ్‌సలో 47 పరుగుల ఆధిక్యం లభించింది. టెరుులెండర్లలో సి.వి. మిలింద్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్‌స టాప్ స్కోర్ కాగా... ఆకాశ్ భండారి 23 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్, భార్గవ్ భట్ చెరో 2 వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటలో ఆంధ్ర తొలి ఇన్నింగ్‌సలో 190 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
రాణించిన విహారి
అనంతరం రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన ఆంధ్ర జట్టు కూడా 51 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. భార్గవ్ భట్ (22), రవితేజ (22)లను సి.వి.మిలింద్ ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన హనుమ విహారి (54 బంతుల్లో 57; 5 ఫోర్లు) వేగంగా పరుగులు జతచేశాడు. ప్రశాంత్ (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) అండతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (4/52) స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆంధ్రా వెన్నువిరిచాడు. క్రీజులో పాతుకుపోరుున విహారి, ప్రశాంత్‌లతో పాటు రికీ భుయ్ (2), ప్రణీత్ (10)లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్నట్లు గమనించిన ఆంధ్ర కెప్టెన్ విహారి... 29.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం 47 పరుగులు కలుపుకొని హైదరాబాద్ ముందు 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు.