హైదరాబాద్ 281/6
ఆంధ్రతో రంజీ మ్యాచ్
సాక్షి, విశాఖపట్నం: రంజీ సీజన్‌ను హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ గౌరవప్రదంగానే మొదలుపెట్టారు. ఆంధ్రతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో తొలిరోజు హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. కెప్టెన్ రవితేజ (96) కొద్దిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఓపెనర్ అక్షత్ రెడ్డి (55) అర్ధసెంచరీ చేయగా... సుమన్ (35), అనిరుధ్ (45) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్‌కుమార్, అయ్యప్ప రెండేసి వికెట్లు తీసుకున్నారు.
గంభీర్ సెంచరీ
న్యూఢిల్లీ: కెప్టెన్ గౌతం గంభీర్ (270 బంతుల్లో 123; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడం తో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సెహ్వాగ్ 9 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఇక హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ (99 బం తుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 81.4 ఓవర్లలో 273కు ఆటౌట్ కాగా హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది.