ranji season
-
Ranji Trophy-2022: ఆంధ్రాపై ముంబై ఘన విజయం..
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 290/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆట కొనసాగించిన ముంబై మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 331 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ అర్మాన్ జాఫర్ (116; 16 ఫోర్లు, 1 సిక్స్) అదే స్కోరు వద్ద అవుటవ్వగా... తనుష్ కొటియన్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ నాలుగు వికెట్లు తీయగా... శశికాంత్, లలిత్ మోహన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 93 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 47 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఉప్పర గిరినాథ్ (27; 6 ఫోర్లు), రికీ భుయ్ (16; 2 ఫోర్లు), కెప్టెన్ విహారి (14), నితీశ్ రెడ్డి (15; 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో తుషార్ (3/34), తనుష్ (2/18), సిద్ధార్థ్ (2/26) రాణించారు. 39 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. చదవండి: PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ -
వేణుగోపాలరావు దూరం
సాక్షి, విజయవాడ: ప్రస్తుత రంజీ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండటం లేదని ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యుడు వై. వేణుగోపాలరావు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని భారత వన్డే జట్టు మాజీ సభ్యుడైన వేణు వివరించాడు. ఈ సీజన్లో ఆంధ్ర జట్టు తమిళనాడు, బరోడా జట్లతో మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. వేణు మాత్రం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో ఆడి కేవలం మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. 1998లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల వేణు తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 121 మ్యాచ్‌లు ఆడి 7,081 పరుగులు చేయడంతోపాటు 66 వికెట్లు పడగొట్టాడు. ‘జట్టులో వేణుగోపాలరావు లేని లోటు కనిపిస్తుంది. అయితే అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వేణు స్థానంలో జ్యోతి సాయికృష్ణను జట్టులో ఎంపిక చేశాం’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. -
ఆంధ్రకు రెండో విజయం
ముంబై: ఈ ఏడాది రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. గత మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై నాలుగు వికెట్లతో నెగ్గిన ఆంధ్ర... తాజాగా హరియాణాపై 77 పరుగులతో నెగ్గింది. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన హరియాణా 123.2 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటరుుంది. రోహిల్లా (118) సెంచరీ చేసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయాడు. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్ నాలుగు, భార్గవ్ భట్ మూడు వికెట్లు తీశారు. హైదరాబాద్‌కు ‘డ్రా’ గౌహతిలో హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. హిమాచల్ రెండో ఇన్నింగ్సలో 301 పరుగులు చేసి ఆలౌట్ అరుుంది. దీంతో హైదరాబాద్‌కు 212 పరుగుల లక్ష్యం ఎదురరుుంది. ఆదివారం చివరి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 54 ఓవర్లలో ఆరు వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
జట్టు నుంచి వెళ్లాక బ్యాట్ ముట్టలేదు
రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌కు దిగా.. * ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఓసారి చోటు కోల్పోయాక ఏ క్రికెటర్ అయినా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కిందా మీదా పడుతుంటారు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఈ విషయంలో బేఫికర్‌గా ఉన్నానంటున్నాడు. గత జూన్‌లో ఈ సౌరాష్ట్ర ఆటగాడు బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ కాదు కదా కనీసం బ్యాట్‌ను కానీ బంతిని కానీ టచ్ చేయలేదంటున్నాడు. ఈ సమయమంతా పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యానని చెప్పాడు. తనకిష్టమైన గుర్రపు స్వారీతో పాటు స్నేహితులతో సరదాగా గడిపానని అన్నాడు. కేవలం రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌పై దృష్టి సారించానని, నిజానికి తన శరీరం విశ్రాంతి కోరుకుందని తెలిపాడు. ఈ సీజన్లో తను సౌరాష్ట్ర తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడు కొద్ది సమయం క్రికెట్‌కు దూరంగా ఉండాలనిపించింది. అందుకే ఆటకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కనీసం బ్యాట్, బంతిని కూడా పట్టుకోలేదు. క్రికెట్ బటన్‌ను స్విచాఫ్ చేసి ఇతర వ్యాపకాల్లో మునిగాను. ఫాంహౌస్‌లో గుర్రాలతోనూ, స్నేహితులతోనూ ఎక్కువ సమయం గడిపాను. రంజీ సీజన్‌కు నెల రోజుల ముందు ప్రాక్టీస్ ప్రారంభిస్తూ నా బలంపై దృష్టి పెట్టాలనుకున్నాను. కొన్ని జిల్లా స్థాయి మ్యాచ్‌లు కూడా ఆడాను. ఇలాంటి ప్రాక్టీస్‌తో సీజన్లో రాణించాను’ అని 26 ఏళ్ల జడేజా పేర్కొన్నాడు. -
బౌలర్లపైనే భారం
అగర్తలా: హైదరాబాద్ బౌలర్లు రాణిస్తేనే ఈ రంజీ సీజన్లో జట్టు బోణీ చేస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర బ్యాట్స్‌మెన్ కుదురుగా ఆడటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. గ్రూప్-సిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఖరి రోజు హైదరాబాద్ ఆటగాళ్లు ఏమాత్రం అలసత్వం వహించిన మరో డ్రాకు సిద్ధపడాలి. తొలి ఇన్నింగ్స్‌ను 491/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన హైదరాబాద్‌కు త్రిపుర రెండో ఇన్నింగ్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. త్రిపుర ఇంకా 67 పరుగులు వెనుకంజలో ఉంది. పూర్తయిన రవితేజ సెంచరీ మూడో రోజు 487/9 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ మరో నాలుగు పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ నాలుగు పరుగులు కెప్టెన్ రవితేజ (128 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో అతని సెంచరీ పూర్తయింది. మూడో రోజు ఉదయం హైదరాబాద్ కేవలం పది బంతులే ఆడి మొత్తానికి తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల భారీ ఆధిక్యం పొందింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన త్రిపుర... బ్యాట్స్‌మెన్ పోరాటంతో ఎదురీదుతోంది. రాణించిన బోస్, సోలంకి ఓపెనర్ బిశాల్ ఘోష్ (28 బంతుల్లో 18, 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, కెప్టెన్ అభిజిత్ డే (123 బంతుల్లో 47, 7 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఉదియన్ బోస్ (139 బంతుల్లో 63, 10 ఫోర్లు, 1 సిక్స్) జట్టును నడిపించాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 133 పరుగులకు చేరింది. ఈ దశలో సి.వి.మిలింద్ స్వల్ప వ్యవధిలో 3 టాపార్డర్ వికెట్లు కూల్చి హైదరాబాద్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ రాకేశ్ సోలంకి (99 బంతుల్లో 71 బ్యా టింగ్, 10 ఫోర్లు), రాజేశ్ బాణిక్ (94 బంతుల్లో 31 బ్యాటింగ్, 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. కెప్టెన్ రవితేజ 8 మంది బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించిన ఈ జోడీని విడదీయలేకపోయారు. స్కోరు వివరాలు త్రిపుర తొలి ఇన్నింగ్స్: 184 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 491/9 డిక్లేర్డ్ త్రిపుర రెండో ఇన్నింగ్స్: బిశాల్ ఘోష్ (సి) ఖలీల్ (బి) ఆశిష్ రెడ్డి 18; ఉదియన్ బోస్ (సి) ఖలీల్ (బి) మిలింద్ 63; అభిజిత్ డే (సి) భండారి (బి) మిలింద్ 47; సోలంకి బ్యాటింగ్ 71; తకవాలే (సి) భండారి (బి) మిలింద్ 0; రాజేశ్ బాణిక్ బ్యాటింగ్ 31; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (81 ఓవర్లలో 4 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1-28, 2-133, 3-134, 4-134 బౌలింగ్: సి.వి.మిలింద్ 16-5-48-3, అన్వర్ 11-2-25-0; ఆశిష్ రెడ్డి 11-2-46-1, రవికిరణ్ 16-5-40-0, భండారి 16-1-39-0, రవితేజ 1-0-5-0, ఖాద్రి 9-2-25-0, తన్మయ్ 1-0-3-0 -
నిప్పులు చెరిగిన అన్వర్
అగర్తలా: ఈ రంజీ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టేందుకు అన్వర్ అహ్మద్‌ఖాన్ (5/53) సువర్ణావకాశాన్ని కల్పించాడు. త్రిపుర బ్యాట్స్‌మెన్‌పై నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో గ్రూప్-సిలో సోమవారం మొదలైన లీగ్ మ్యాచ్‌లో త్రిపుర మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌ను 45.1 ఓవర్లలో 184 పరుగుల వద్ద ముగించింది. అనంతరం హైదరాబాద్ ఓపెనర్లు అక్షత్ (122 బంతుల్లో 66 బ్యాటింగ్, 10 ఫోర్లు), తన్మయ్ (92 బంతుల్లో 39, 5 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. మొత్తానికి ఆడింది అగర్తలాలోనైనా తొలి రోజు అదరగొట్టింది మాత్రం హైదరాబాద్ ఆటగాళ్లే. టపటపా వికెట్లు ఈ సీజన్లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన అన్వర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన త్రిపుర 68 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు మిలింద్ (3/56) కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. మిడిలార్డర్ కౌషల్ అచర్జీ (55), మణిశంకర్ మురాసింగ్ (44) కుదురుగా ఆడటంతో త్రిపుర ఆ మాత్రం స్కోరైనా చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ 36 ఓవర్లో వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షత్, తన్మయ్ మొదటి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఇదే స్కోరుపై ఆట చివరి ఓవర్లో తన్మయ్ నిష్ర్కమించడంతో హైదరాబాద్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షత్‌కు జతగా మిలింద్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు త్రిపుర తొలి ఇన్నింగ్స్: బిశాల్ ఘోష్ (ఎల్బీడబ్ల్యూ బి) మిలింద్ 2; ఉదియన్ బోస్ (సి) ఖలీల్ (బి) అన్వర్ 0; అభిజిత్ డే (బి) రవికిరణ్ 19; రాకేశ్ సోలంకి (సి) ఖలీల్ (బి) అన్వర్ 24; యోగేశ్ (సి) ఖలీల్ (బి) ఆశిష్ రెడ్డి 11; రాజేశ్ (సి) ఖలీల్ (బి) మిలింద్ 0; కౌషల్ అచర్జీ (సి) అక్షత్ (బి) మిలింద్ 55; మురాసింగ్ (సి) తన్మయ్ (బి) అన్వర్ 44; తుషార్ సాహా (ఎల్బీడబ్ల్యూ బి) అన్వర్ 0; రాణా దత్త నాటౌట్ 12; అభిజిత్ సర్కార్ (సి) తన్మయ్ (బి) అన్వర్ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 184 వికెట్ల పతనం: 1-2, 2-10, 3-40, 4-61, 5-61, 6-68, 7-151, 8-151, 9-182, 10-184 బౌలింగ్: మిలింద్ 13-3-56-3, అన్వర్ 15.1-4-53-5, రవికిరణ్ 11-2-48-1, ఆశిష్ 5-2-11-1, ఆకాశ్ భండారి 1-0-1-0 హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: అక్షత్ రెడ్డి బ్యాటింగ్ 66; తన్మయ్ (సి) తకవాలే (బి) మురాసింగ్ 39; మిలింద్ బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (36 ఓవర్లలో వికెట్ నష్టానికి) 116 వికెట్ పతనం: 1-114 బౌలింగ్: మురాసింగ్ 13-3-24-1, రాణా దత్త 8-1-30-0, అభిజిత్ సర్కార్ 5-0-25-0, కౌషల్ అచర్జీ 6-2-8-0, తుషార్ సాహా 4-0-19-0. -
ఆంధ్ర లక్ష్యం 218
విజయనగరం: బ్యాట్స్‌మెన్ బాధ్యతతో ఆడితే... ఈ రంజీ సీజన్లో ఆంధ్ర జట్టు బుధవారం తొలి విజయాన్ని నమోదు చేసుకుంటుంది. కేరళతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మూడో రోజు మంగళవారం ఆంధ్ర బౌలర్ల ధాటికి కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలింది. విజయ్ కుమార్ 33 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి కేరళ పతకాన్ని శాసించాడు. స్టీఫెన్ (2/52), అయ్యప్ప (2/8) కూడా బంతితో రాణించారు. అనంతరం 218 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. భరత్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 బ్యాటింగ్), ప్రశాంత్ (21 బంతుల్లో ఫోర్‌తో 13 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆట చివరి రోజు విజయానికి ఆంధ్ర 163 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 229 పరుగులకు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు ఆలౌటైంది. -
హైదరాబాద్ 281/6
ఆంధ్రతో రంజీ మ్యాచ్ సాక్షి, విశాఖపట్నం: రంజీ సీజన్‌ను హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ గౌరవప్రదంగానే మొదలుపెట్టారు. ఆంధ్రతో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో తొలిరోజు హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. కెప్టెన్ రవితేజ (96) కొద్దిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఓపెనర్ అక్షత్ రెడ్డి (55) అర్ధసెంచరీ చేయగా... సుమన్ (35), అనిరుధ్ (45) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్‌కుమార్, అయ్యప్ప రెండేసి వికెట్లు తీసుకున్నారు. గంభీర్ సెంచరీ న్యూఢిల్లీ: కెప్టెన్ గౌతం గంభీర్ (270 బంతుల్లో 123; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలం కావడం తో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సెహ్వాగ్ 9 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఇక హరియాణాతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ (99 బం తుల్లో 59; 6 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ 81.4 ఓవర్లలో 273కు ఆటౌట్ కాగా హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. -
ఒప్పించి మెప్పించాడు
తండ్రి సైనికుడు... కొడుకు క్రమశిక్షణతో బాగా చదివి వృద్ధిలోకి రావాలన్నదే ఆయన ఆకాంక్ష. కుర్రాడు కూడా అదే ఆలోచనతో 12వ తరగతి వరకు... ఆటలంటూ తిరగకుండా బుద్ధిగా చదువుకున్నాడు. అయితే సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక బౌలింగ్ ట్రయల్స్ కార్యక్రమం అతని జీవితాన్ని మార్చేసింది. ఐదేళ్ల లోపే రాష్ట్ర క్రికెట్ జట్టుకు, తాజాగా భారత టీమ్‌లోకి ఎంపికైన ఆ కుర్రాడే ఈశ్వర్ చంద్ పాండే. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఈ 6.2 అడుగుల ఎత్తున్న పేసర్ నేపథ్యం, క్రికెటర్‌గా మారిన వైనం ఆసక్తికరం. ముంబై: న్యూజిలాండ్‌లో పర్యటించే భారత జట్టును ప్రకటించగానే చాలామందిని ఆశ్చర్యపరిచిన పేరు ఈశ్వర్ పాండే. గత సీజన్లో రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు ఉన్నా... అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లోనూ భారత జట్టుకు ఎంపిక కావడం ఆశ్చర్యకరమే. అసలు ఈశ్వర్ పాండే నేపథ్యమే ఆసక్తికరం. సాధారణంగా భారతదేశంలో ఎవరైనా పిల్లలు కెరీర్‌గా క్రికెట్‌ను ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు సంతోషించే పరిస్థితి. కానీ ఈశ్వర్ తండ్రి మాత్రం ఆటలకు ‘నో’ అన్నారు. బుద్దిగా చదువుకుని ఏదో ఒక మంచి ఉద్యోగంలో చేరమని సూచించారు. ఓ వైపు మనసు క్రికెట్ వైపు లాగుతున్నా... తండ్రి మాటను కాదనలేని పరిస్థితి. క్లాసులో సైన్స్ పాఠాలు వింటున్నా... మనసు మాత్రం క్రికెట్ కోచింగ్ కావాలంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం నాడే పుట్టిన పాండే... మొదట్లో స్నేహితులతో సరదాగా టెన్నిస్‌బాల్‌తో క్రికెట్ ఆడే వాడు. 12వ తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో ఓ స్నేహితుడితో కలిసి సమ్మర్ క్యాంప్‌కు వెళ్లాడు. అక్కడ తొలిసారి ‘లెదర్ బంతి’తో బౌలింగ్ చేశాడు. పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడాలని కోరిక ఉన్నా తండ్రి ఏమంటారో అనే సందేహం ఓ వైపు. ఈలోగా ఈశ్వర్ నైపుణ్యాన్ని యూనివర్శిటీ కోచ్ అరిల్ ఆంథోనీ గుర్తించారు. అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు. ఈ దశలో ఈశ్వర్ తొలిసారి తన తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. ‘నేను ఆర్మీలో చేరాలని నాన్న పట్టుపట్టకపోయినా, ఒక మంది ఉద్యోగం సాధించాలని మాత్రం చెప్పేవారు. అందుకే క్రికెటర్ అయ్యేందుకు ఆయన ససేమిరా అన్నారు’ అని పాండే ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు. చివరకు ఈశ్వర్ తండ్రిని ఒప్పించే బాధ్యత కూడా ఆంథోనీయే తీసుకున్నారు. ఒక్కసారి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చాక ఈశ్వర్ రెట్టింపు కష్టపడ్డాడు. కట్ చేస్తే... ఐదే సంవత్సరాల్లో మధ్య ప్రదేశ్ జట్టులోకి వచ్చి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్‌గా... ‘నా దృష్టిలో బ్యాటింగ్‌కంటే బౌలింగ్ చేయడం చాలా బాగా అనిపించింది. బౌలింగ్‌ను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే ప్రొఫెషనల్‌గా ఆ వైపు మళ్లాను’ అని అతను తన ఆరంభాన్ని గుర్తు చేసుకున్నాడు. పాండే పేసర్‌గా ఎదగడంలో చాలా మంది పాత్ర ఉంది. అతడిని మరింత మెరుగైన బౌలర్‌గా తీర్చి దిద్దేందుకు మాజీ క్రికెటర్ అమయ్ ఖురాసియా... ఎం.ఆర్.ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేర్పించారు. ‘ఖురాసియా చలవతో నేను ఎం.ఆర్.ఎఫ్. ఫౌండేషన్‌కు వెళ్లాను. అక్కడ డెన్నిస్ లిల్లీతో పాటు... నేను అభిమానించే మెక్‌గ్రాత్ నా లోపాలు సరిదిద్దారు. ఇక పుణే జట్టు బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్ కూడా నాకు ఎంతో విలువైన సూచనలిచ్చారు’ అని పాండే చెప్పాడు. భవిష్యత్తుపై గురి... తొలి రెండు రంజీ సీజన్లలోనే ఆకట్టుకున్న ఈశ్వర్ పాండే 2012-13 సీజన్లో అత్యధిక వికెట్లు (48) తీసిన బౌలర్‌గా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. దీంతో పుణే జట్టులో ఐపీఎల్ ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత ఇండియా ‘ఎ’ జట్టు సభ్యుడిగా దక్షిణాఫ్రిలో పర్యటించిన పాండే... రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో, లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 11 చొప్పున వికెట్లు పడగొట్టాడు. ఆ ప్రదర్శనే అతనికి జాతీయ టెస్టు, వన్డే జట్టులో చోటు కల్పించింది. ‘చాలా మంది బౌలర్లు కలలు గనే న్యూజిలాండ్ గడ్డపై తొలి సిరీస్ ఆడనుండటం నాకు కలిసొస్తుందనే నమ్ముతున్నా. జహీర్ మార్గదర్శకత్వం కూడా ఆశిస్తున్నా. ప్రస్తుతం 130-135 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాను. వేగంకంటే కూడా నా స్వింగ్‌ను మెరుగు పర్చుకోవడంపైనే దృష్టి పెట్టా’ అని పాండే చెప్పాడు. 24 ఏళ్ల ఈశ్వర్, కివీస్ సిరీస్‌లో సత్తా చాటితే భారత పేస్ బౌలింగ్ మరింత పదునెక్కడం ఖాయం.