నిప్పులు చెరిగిన అన్వర్
అగర్తలా: ఈ రంజీ సీజన్‌లో హైదరాబాద్ బోణీ కొట్టేందుకు అన్వర్ అహ్మద్‌ఖాన్ (5/53) సువర్ణావకాశాన్ని కల్పించాడు. త్రిపుర బ్యాట్స్‌మెన్‌పై నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. దీంతో గ్రూప్-సిలో సోమవారం మొదలైన లీగ్ మ్యాచ్‌లో త్రిపుర మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌ను 45.1 ఓవర్లలో 184 పరుగుల వద్ద ముగించింది. అనంతరం హైదరాబాద్ ఓపెనర్లు అక్షత్ (122 బంతుల్లో 66 బ్యాటింగ్, 10 ఫోర్లు), తన్మయ్ (92 బంతుల్లో 39, 5 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్నిచ్చారు. మొత్తానికి ఆడింది అగర్తలాలోనైనా తొలి రోజు అదరగొట్టింది మాత్రం హైదరాబాద్ ఆటగాళ్లే.
టపటపా వికెట్లు
ఈ సీజన్‌లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన అన్వర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన త్రిపుర 68 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు మిలింద్ (3/56) కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు.
మిడిలార్డర్ కౌషల్ అచర్జీ (55), మణిశంకర్ మురాసింగ్ (44) కుదురుగా ఆడటంతో త్రిపుర ఆ మాత్రం స్కోరైనా చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ 36 ఓవర్లో వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షత్, తన్మయ్ మొదటి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఇదే స్కోరుపై ఆట చివరి ఓవర్లో తన్మయ్ నిష్ర్కమించడంతో హైదరాబాద్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అక్షత్‌కు జతగా మిలింద్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
త్రిపుర తొలి ఇన్నింగ్స్: బిశాల్ ఘోష్ (ఎల్బీడబ్ల్యూ బి) మిలింద్ 2; ఉదియన్ బోస్ (సి) ఖలీల్ (బి) అన్వర్ 0; అభిజిత్ డే (బి) రవికిరణ్ 19; రాకేశ్ సోలంకి (సి) ఖలీల్ (బి) అన్వర్ 24; యోగేశ్ (సి) ఖలీల్ (బి) ఆశిష్ రెడ్డి 11; రాజేశ్ (సి) ఖలీల్ (బి) మిలింద్ 0; కౌషల్ అచర్జీ (సి) అక్షత్ (బి) మిలింద్ 55; మురాసింగ్ (సి) తన్మయ్ (బి) అన్వర్ 44; తుషార్ సాహా (ఎల్బీడబ్ల్యూ బి) అన్వర్ 0; రాణా దత్త నాటౌట్ 12; అభిజిత్ సర్కార్ (సి) తన్మయ్ (బి) అన్వర్ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 184
వికెట్ల పతనం: 1-2, 2-10, 3-40, 4-61, 5-61, 6-68, 7-151, 8-151, 9-182, 10-184
బౌలింగ్: మిలింద్ 13-3-56-3, అన్వర్ 15.1-4-53-5, రవికిరణ్ 11-2-48-1, ఆశిష్ 5-2-11-1, ఆకాశ్ భండారి 1-0-1-0
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: అక్షత్ రెడ్డి బ్యాటింగ్ 66; తన్మయ్ (సి) తకవాలే (బి) మురాసింగ్ 39; మిలింద్ బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (36 ఓవర్లలో వికెట్ నష్టానికి) 116
వికెట్ పతనం: 1-114
బౌలింగ్: మురాసింగ్ 13-3-24-1, రాణా దత్త 8-1-30-0, అభిజిత్ సర్కార్ 5-0-25-0, కౌషల్ అచర్జీ 6-2-8-0, తుషార్ సాహా 4-0-19-0.