ఆంధ్ర, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా | Andhra,maharashtra match draw | Sakshi
Sakshi News home page

ఆంధ్ర, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా

Published Mon, Dec 2 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

Andhra,maharashtra match draw

కడప, న్యూస్‌లైన్: ఆంధ్ర, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన మహారాష్ట్రకు మూడు పాయింట్లు దక్కగా ఆతిథ్య జట్టుకు ఒక పాయింట్ లభించింది. గ్రూప్-సి లో భాగంగా వైఎస్ రాజారెడ్డి మైదానంలో ఆదివారం నాలుగో రోజు ఆంధ్ర జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది.
 
 చిరంజీవి (209 బంతుల్లో 85; 12 ఫోర్లు; 2 సిక్స్), సురేశ్ (115 బంతుల్లో 38; 3 ఫోర్లు) రాణించారు. సంక్లేచకు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు 27/1 ఓవర్‌నైట్ స్కోరు తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ప్రదీప్ (37 బంతుల్లో 25; 5 ఫోర్లు) తో కలిసి ఐదో వికెట్‌కు 49 పరుగులు, సురేశ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 55 పరుగులు జోడించిన చిరంజీవి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement