పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు.
వడోదరా: పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు.
తర్వాత కొంత మంది ప్రేక్షకులు జాదవ్, రాయుడులను కూడా గెలి చేయడంతో యూసుఫ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిపించి తిడుతూ చెంపమీద ఓ దెబ్బ వేశాడు. యూసుఫ్ చేసిన తప్పు లెవల్-3 కిందకు వచ్చినప్పటికీ ఇదే తొలిసారి కావడంతో బోర్డు మందలింపుతో సరిపెట్టింది.