Yousuf Pathan
-
బౌలర్లను ఉతికారేసిన యువరాజ్.. సిక్సర్ల వర్షం! వీడియో
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను యువీ ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్న అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. గతంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై యువీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2000లో ఆసీస్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసిన యువీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీపైనల్లో కంగరూలపై హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. 2011 క్వార్టర్ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ సిక్సర్ల వీరుడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2000, 2007, 2011 and now 2024 🚀Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4— FanCode (@FanCode) July 12, 2024 -
ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ పోస్టు
హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ యూసుఫ్ పఠాన్‌కు ఐపీఎల్ 2020 వేలంలో చుక్కెదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడిని వదులుకోగా.. రూ. కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు కూడా యూసుఫ్ పఠాన్‌ను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్, యూసుఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్లో స్పందించాడు. ‘తాత్కాలిక ఇబ్బందులు ఏవీ కూడా నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేము. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్ విన్నర్‌వి’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా, యూసుఫ్ పఠాన్ 2019 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ తరపున ఆడి పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ 10 మ్యాచ్‌లు ఆడి, 13.33 సగటుతో కేవలం 40 పరుగులనే సాధించాడు. ఐపీఎల్ మొత్తం సీజన్లో కేవలం ఆరు బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇక యూసుఫ్‌తో పాటు చాలామంది స్టార్ క్రికెటర్లకు 2020 ఐపీఎల్ వేలం నిరాశే మిగిల్చింది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్, ఆసీస్ స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. కమ్మిన్స్ రూ. 15 కోట్లకు పైగా అమ్ముడు పోగా, మ్యాక్స్‌వెల్‌ను రూ. 10.5 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. చదవండి: ముగిసిన ఐపీఎల్ వేలం కోట్లాభిషేకం Small hiccups doesn’t define your career,you have been outstanding thru out. A real match winner. Love you always Lala @iamyusufpathan pic.twitter.com/h3tw3AjoGS— Irfan Pathan (@IrfanPathan) December 19, 2019 -
డోప్ టెస్ట్‌లో యూసఫ్ పఠాన్ విఫలం
-
పఠాన్‌కు షాకిచ్చిన బీసీసీఐ
సాక్షి, ముంబై : టీమిండియా బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. డోప్ టెస్ట్‌లో విఫలం కావటంతో అతనిపై 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. టర్‌బ్యూటలైన్(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్ తీసుకున్నాడు. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పఠాన్ గానీ, టీం డాక్టర్ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు. ఇక డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో అతను రంజీ మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14తో ఆ సస్పెన్షన్ ముగియనుండటం పఠాన్‌కు ఊరటనిచ్చే విషయం. ఇంతకు ముందు 2012లో ఐపీఎల్ ప్రదీప్ సంగ్వాన్ కూడా ఇలాగే డోపింగ్‌కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కున్నాడు. -
నిరుపేదల కోసం.. పఠాన్ బ్రదర్స్
సాక్షి, న్యూఢిల్లీ: నిరుపేద పిల్లలను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు నడుం బిగించారు. పఠాన్ క్రికెట్ అకాడమీ పేరిట నిరుపేద పిల్లలకు మొబైల్ సంస్థ ‘ఒప్పో’ అందించిన 20 లక్షల స్కాలర్ షిప్ సాయంతో రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపుకు రెండు దశల్లో నిర్వహించిన సెలక్షన్ పోటీల్లో 17 మంది నిరుపేద క్రికెటర్లను ఎంపికయ్యారు. ఈ పోటీలకు 50 మంది పాల్గొనగా తొలి రౌండ్లో 30 మంది ఎంపికవ్వగా.. రెండో రౌండ్లో 17 మందిని ఎంపిక చేశారు. ఈ పిల్లలంతా పఠాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పలువురి క్రికెట్ దిగ్గజాల శిక్షణతో రాటుదేలనున్నారు. -
ఐపీఎల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీరులు వీరే..
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ నేడు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో గతేడాది విన్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఓవరాల్ ఐపీఎల్ సీజన్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఖాతాలో 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లున్నాయి. ఇందులో 14 అవార్డులను కేవలం మూడు సీజన్లలో సాధించడం విశేషం. 2011లో ఆరు, 2012లో ఐదు, 2013లో 3 సొంతం చేసుకున్నాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆ జట్టు తరఫున 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, మొదట్లో ప్రాతినిధ్యం వహించిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడిగా ఒక అవార్డు సాధించాడు. 2011, 12 సీజన్లలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన విషయం తెలిసిందే. 2. యూసఫ్ పఠాన్ మొదటి మూడు సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కు, 2011 నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యూసఫ్ పఠాన్. రాజస్థాన్ ఆటగాడిగా 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, కేకేఆర్ ఆటగాడిగా 5 అవార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా 14 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో రెండో స్థానంలో నిలిచాడు పఠాన్. 3. మైక్ హస్సీ ఈ ఆస్ట్రేలియా ఆటగాడు ఐపీఎల్ తొలి సీజన్లలో పరుగుల వేటలో ముందున్నాడు. ఆపై ఇతడి జోరు తగ్గింది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఓవరాల్ గా 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు హస్సీ ఖాతాలో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై చేసిన సెంచరీ ఇతడి కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకమే. 4. గౌతమ్ గంభీర్ ఐపీఎల్ స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లలో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఒకడు. మొదటి మూడు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున, ఆ తర్వాతి నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ ఆటగాడిగా 3, కేకేఆర్ ఆటగాడిగా 8 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు కొల్లగొట్టాడు గంభీర్. 2008, 2012 సీజన్లలో అత్యధిక పరుగుల ఆటగాళ్లతో రెండో స్థానంలో నిలిచాడు. 5. వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ తొలి ఆరు సీజన్లు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు, ఆ తర్వాతి సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించాడు సెహ్వాగ్. ఢిల్లీ ఆటగాడిగా 10, పంజాబ్ ప్లేయర్ గా ఒక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2008, 2011 సీజన్లలో రెండు చొప్పున, 2012లో మూడు, 2009, 2010, 2013, 2014లలో ఒక్కో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నెగ్గాడు. 6. ఎంఎస్ ధోనీ గత సీజన్లో నిషేధం పడే వరకూ ఐపీఎల్ ఆరంభం నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 2016లో కొత్త ప్రాచైజీ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఓవరాల్ గా 112 మ్యాచ్ లాడిన ధోనీ 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు నెగ్గాడు ధోనీ. 99 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 14 హాఫ్ సెంచరీల సాయంతో 40.84 సగటుతో 2614 పరుగులు చేశాడు. -
టి20 ప్రపంచకప్‌కు వచ్చేస్తా
మార్చిలో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టులోకి వచ్చేస్తానని ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. చివరిసారిగా 2012లో భారత్ తరఫున తను టి20 మ్యాచ్ ఆడాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు రంజీట్రోఫీలోనూ నిలకడగా రాణించా. బౌలర్‌గా పూర్తి కోటా ఓవర్లు వేస్తున్నాను. సరైన దిశలో వెళుతున్నందున టి20 ప్రపంచకప్ సమయానికి జట్టులోకి వస్తానని నమ్ముతున్నా’ అని యూసుఫ్ చెప్పాడు. -
ప్రేక్షకుడిని కొట్టిన యూసుఫ్ పఠాన్
వడోదరా: పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన రంజీ మ్యాచ్ సందర్భంగా యూసుఫ్ ఓ ప్రేక్షకుడి చెంప చెళ్లుమనిపిం చాడు. మంగళవారం మూడో రోజు ఆటలో యూ సుఫ్ (9) అవుటై వెళ్తున్న సందర్భంలో పెవిలియన్ దగ్గర కూర్చొన్న ప్రేక్షకుడు ఒకరు అసభ్య పదజాలంతో దూషించాడు. తర్వాత కొంత మంది ప్రేక్షకులు జాదవ్, రాయుడులను కూడా గెలి చేయడంతో యూసుఫ్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆ ప్రేక్షకుడిని డ్రెస్సింగ్ రూమ్‌కు పిలిపించి తిడుతూ చెంపమీద ఓ దెబ్బ వేశాడు. యూసుఫ్ చేసిన తప్పు లెవల్-3 కిందకు వచ్చినప్పటికీ ఇదే తొలిసారి కావడంతో బోర్డు మందలింపుతో సరిపెట్టింది.