వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఆసీస్ బౌలర్లను యువీ ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్న అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.
గతంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై యువీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2000లో ఆసీస్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసిన యువీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీపైనల్లో కంగరూలపై హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు.
2011 క్వార్టర్ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ సిక్సర్ల వీరుడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది.
2000, 2007, 2011 and now 2024 🚀
Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4— FanCode (@FanCode) July 12, 2024
Comments
Please login to add a commentAdd a comment