సాక్షి, న్యూఢిల్లీ: నిరుపేద పిల్లలను క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు భారత క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్‌లు నడుం బిగించారు. పఠాన్ క్రికెట్ అకాడమీ పేరిట నిరుపేద పిల్లలకు మొబైల్ సంస్థ ‘ఒప్పో’ అందించిన 20 లక్షల స్కాలర్ షిప్ సాయంతో రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ క్యాంపుకు రెండు దశల్లో నిర్వహించిన సెలక్షన్ పోటీల్లో 17 మంది నిరుపేద క్రికెటర్లను ఎంపికయ్యారు. ఈ పోటీలకు 50 మంది పాల్గొనగా తొలి రౌండ్‌లో 30 మంది ఎంపికవ్వగా.. రెండో రౌండ్‌లో 17 మందిని ఎంపిక చేశారు. ఈ పిల్లలంతా పఠాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పలువురి క్రికెట్ దిగ్గజాల శిక్షణతో రాటుదేలనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment