సాక్షి, ముంబై : టీమిండియా బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. డోప్ టెస్ట్‌లో విఫలం కావటంతో అతనిపై 5 నెలల వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.
గతేడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో యూసఫ్ నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. టర్‌బ్యూటలైన్(దగ్గు మందుకు సంబంధించింది) పదార్థాన్ని యూసఫ్ తీసుకున్నాడు. ఒకవేళ ఆటగాడు ఆ డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే మాత్రం అందుకు అధికారులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, పఠాన్ గానీ, టీం డాక్టర్ గానీ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయలేదు.
ఇక డోపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడే బీసీసీఐ అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో అతను రంజీ మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. పఠాన్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బీసీసీఐ తక్కువ శిక్షతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, గత ఆగష్టు 15వ తేదీ నుంచి అతనిపై నిషేధం అమలులోకి రాగా.. ఆ లెక్కన జనవరి 14తో ఆ సస్పెన్షన్ ముగియనుండటం పఠాన్‌కు ఊరటనిచ్చే విషయం. ఇంతకు ముందు 2012లో ఐపీఎల్ ప్రదీప్ సంగ్వాన్ కూడా ఇలాగే డోపింగ్‌కు పాల్పడి 18 నెలల నిషేధం ఎదుర్కున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment