జమ్మూ కశ్మీర్కు ఆధిక్యం | Ranji Trophy 2016: Kerala eye first innings lead against Jammu and kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్కు ఆధిక్యం

Published Sun, Oct 23 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

Ranji Trophy 2016: Kerala eye first innings lead against Jammu and kashmir

ముంబై: ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌కు తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం లభించింది. శనివారం మూడో రోజు ఆంధ్ర తొలి ఇన్నింగ్‌‌సలో 99.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటరుుంది. రవితేజ (81), ప్రదీప్ (47) రాణించారు. జమ్మూ బౌలర్లలో అజీజ్ ఐదు, రసూల్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్‌‌సలో 79 పరుగుల ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్ జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్‌‌సలో 18.5 ఓవర్లలో రెండు వికెట్లకు 31 పరుగులు చేసింది.

హైదరాబాద్ తడబాటు
భువనేశ్వర్‌లో కేరళతో జరగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌‌సలో 87 ఓవర్లలో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది. సందీప్ (53) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్‌‌సను 181 ఓవర్లలో 9 వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement