రాణించిన యువరాజ్
యూపీతో రంజీ మ్యాచ్
హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతోన్న రంజీట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో యువరాజ్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (107 బంతుల్లో 72 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్) బ్యాట్ ఝుళిపించాడు. మనన్ వోహ్రా (59), జీవన్‌జ్యోత్ సింగ్ (62) అర్ధసెంచరీలతో రాణించారు.
ప్రత్యర్థి బౌలర్లలో సౌరభ్ కుమర్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 300/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఉత్తర్‌ప్రదేశ్ మరో 35 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్‌సలో మొత్తం 102.5 ఓవర్లలో 335 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (71), సౌరభ్‌కుమార్ (52) రాణించారు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... శుబేక్ సింగ్ గిల్ 3 వికెట్లు పడగొట్టాడు.