ధర్మశాల: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయినా హైదరాబాద్ జట్టు సమష్టి కృషితో చక్కటి విజయాన్ని సాధించింది. అహ్మద్ ఖాద్రి (154 బంతుల్లో 101 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ శతకం సహాయంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించగా ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. దీంతో రంజీ మ్యాచ్ గ్రూప్ సి విభాగంలో హిమాచల్ ప్రదేశ్‌పై హైదరాబాద్ జట్టు 185 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
ఈ గెలుపుతో జట్టుకు ఆరు పాయింట్లు దక్కాయి. హెచ్‌పీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆదివారం హైదరాబాద్ 113.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 355 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో 296 పరుగుల ఆధిక్యం లభించింది. అక్షయ్ చౌహాన్‌కు ఐదు, రిషి ధావన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన హిమాచల్ జట్టు... హైదరాబాద్ పేసర్ రవికిరణ్ (4/42) ధాటికి 35.5 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. పరాస్ డోగ్రా (84 బంతుల్లో 37; 7 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. అబ్సొలెం, ఓజా రెండేసి వికెట్లు తీయగా నాయుడు, విహారిలకు ఒక్కో వికెట్ దక్కింది.
ఖాద్రి మెరుపులు
అంతకుముందు 319/7 ఓవర్‌నైట్ స్కోరుతో హైదరాబాద్ చివరి రోజు ఆట ప్రారంభించగా టెయిలెండర్ల సహాయంతో అహ్మద్ ఖాద్రి చకచకా స్కోరు పెంచాడు. దీంతో 77 పరుగుల తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 24 పరుగులు చేర్చి సెంచరీ సాధించాడు. చివర్లో తనకు అబ్సొలెం (11), ఓజా (5) సహకరించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన హిమాచల్ ఏ దశలోనూ విజయం వైపు పయనించలేదు. పర్యాటక జట్టు బౌలర్లు వారిని కుదురుకోనీయలేదు. ఆరో ఓవర్ నుంచే వికెట్ల పతనం ప్రారంభమైంది.
30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా స్పిన్నర్ ఓజా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి దెబ్బ తీశాడు. ఇక నిలకడగా ఆడుతున్న డోగ్రాతో పాటు ధావన్‌ను వరుస బంతుల్లో రవికిరణ్ పెవిలియన్‌కు పంపడంతో 73 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. ఇదే జోరుతో హైదరాబాద్ బౌలర్లు ఆరు ఓవర్లలో మిగిలిన నాలుగు వికెట్లను నేలకూల్చి జట్టుకు విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 237 ఆలౌట్
హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: సుమన్ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 30; అక్షత్ (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 43; రవితేజ (సి) ఆతిశ్ (బి) రిషి ధావన్ 73; విహారి (సి) ఆతిశ్ (బి) అక్షయ్ చౌహాన్ 41; సందీప్ (బి) అక్షయ్ చౌహాన్ 9; అహ్మద్ ఖాద్రీ నాటౌట్ 101; హబీబ్ అహ్మద్ (సి) రిషి ధావన్ (బి) అక్షయ్ చౌహాన్ 28; కనిష్క్ నాయుడు (సి) చోప్రా (బి) అక్షయ్ చౌహాన్ 0; అబ్సొలెం (సి) చోప్రా (బి) ధావన్ 11; ఓజా నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (113.5 ఓవర్లలో 8 వికెట్లకు) 355.
వికెట్ల పతనం: 1-58, 2-99, 3-181, 4-195, 5-231, 6-290, 7-292; 8-339.
బౌలింగ్: విక్రమ్‌జిత్ 26-7-86-0, రిషి ధావన్ 38-12-85-3, అహ్మద్ 18.5-3-48-0, బిపుల్ శర్మ 2-0-14-0, అక్షయ్ చౌహాన్ 26-3-98-5, అభినవ్ బాలి 3-0-15-0.
హిమాచల్ ప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: చోప్రా (సి) అహ్మద్ (బి) నాయుడు 7; సంగ్రామ్ సింగ్ ఎల్బీడబ్ల్యు (బి) విహారి 5; డోగ్రా ఎల్బీడబ్ల్యు (బి) రవికిరణ్ 37; బాలి (సి) సందీప్ (బి) ఓజా 15; మోహిల్ (సి) సందీప్ (బి) ఓజా 0; భలైక్ ఎల్బీడబ్ల్యు (బి)అబ్సొలెం 12; ధావన్ (సి) సబ్ షిండే (బి) రవికిరణ్ 0; విపుల్ (సి) రవితేజ (బి) అబ్సొలెం 4; మాలిక్ (సి) అహ్మద్ (బి) రవికిరణ్ 10; చౌహాన్ (సి) అహ్మద్ (బి) రవికిరణ్ 12; అహ్మద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (35.5 ఓవర్లలో ఆలౌట్) 111.
వికెట్ల పతనం: 1-9; 2-30; 3-59; 4-59; 5-73; 6-73; 7-82; 8-89; 9-105; 10-111.
బౌలింగ్: అబ్సొలెం 8-0-27-2; నాయుడు 9-3-20-1;రవికిరణ్ 8.5-0-42-4; విహారి 4-0-11-1; ఓజా 6-4-8-2.