రజనీశ్ గుర్బానీ
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పట్టు బిగించింది. 800/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు అనంతరం ప్రత్యర్థి కీలక వికెట్లు తీసి ఆధిపత్యం కొనసాగించింది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 564 పరుగులు వెనుకబడి ఉంది.
పేస్ బౌలర్ రజనీశ్ గుర్బానీ (4/46) ధాటికి 98 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (171 బంతుల్లో 81 బ్యాటింగ్; 10 ఫోర్లు), జయంత్ యాదవ్ (62 బ్యాటింగ్; 9 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అభేద్యమైన ఏడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ఓపెనర్ పృథ్వీ షా (51; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న సమర్థ్ (0), మయాంక్ అగర్వాల్ (11)లతో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్ (21), మరో ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (0), అశ్విన్ (8) విఫలమయ్యారు. అంతకుముందు 702/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ అపూర్వ్ వాంఖడే (157; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారీ స్కోరు చేయగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment