Irani Cup match
-
డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్ విసిరేలా ధనాధన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈసారి ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్ తీసి డ్రెసింగ్ రూం వైపు బ్యాట్ చూపుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్‌తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్‌గా నిలిచి.. రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతోంది.భారీ స్కోరు సాధించిలక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్ మొదలైంది. ఇందులో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! 💯 turns into 2⃣0⃣0⃣ 👌A sensational double century for Sarfaraz Khan✌️He becomes the 1⃣st Mumbai player to score a double ton in #IraniCup 👏The celebrations say it all 🎉#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/225bDX7hhn— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024 -
విదర్భ 800/7 డిక్లేర్డ్
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పట్టు బిగించింది. 800/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు అనంతరం ప్రత్యర్థి కీలక వికెట్లు తీసి ఆధిపత్యం కొనసాగించింది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 564 పరుగులు వెనుకబడి ఉంది. పేస్ బౌలర్ రజనీశ్ గుర్బానీ (4/46) ధాటికి 98 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (171 బంతుల్లో 81 బ్యాటింగ్; 10 ఫోర్లు), జయంత్ యాదవ్ (62 బ్యాటింగ్; 9 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అభేద్యమైన ఏడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ఓపెనర్ పృథ్వీ షా (51; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సమర్థ్ (0), మయాంక్ అగర్వాల్ (11)లతో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్ (21), మరో ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (0), అశ్విన్ (8) విఫలమయ్యారు. అంతకుముందు 702/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ అపూర్వ్ వాంఖడే (157; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారీ స్కోరు చేయగలిగింది. -
విదర్భ 702/5
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 5 వికెట్ల నష్టానికి 702 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 588/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (431 బంతుల్లో 286; 34 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక్క పరుగు మాత్రమే జతచేసి ట్రిపుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అపూర్వ్ వాంఖడే (99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షయ్ వాడ్కర్ (37; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 91 పరుగులు జతచేశాడు. అక్షయ్ అవుటయ్యాక మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్న అపూర్వ్తో పాటు ఆదిత్య సర్వతే (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 2, అశ్విన్, నదీమ్ జయంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. మూడో రోజు అశ్విన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. 28 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో నాలుగో రోజు విదర్భ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో విదర్భ డిక్లేర్ చేసిన అనంతరం రెస్టాఫ్ ఇండియాను ఆలౌట్ చేయలేకపోతే... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం కాకుండా ఇన్నింగ్స్ రన్‌రేట్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు. -
నాలుగు పదుల కుర్రాడు!
ఇరానీ కప్ మ్యాచ్‌లో వసీం జాఫర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగానే అందరికంటే ముందుగా 18 ఏళ్ల ముంబైకర్ పృథ్వీ షా చప్పట్లతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జాఫర్ 18 ఏళ్ల వయసులో ముంబై తరఫున తన రెండో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకట్టుకున్నప్పుడు పృథ్వీ ఇంకా పుట్టనే లేదు... అతను తొలి టెస్టు ఆడే సమయానికి పృథ్వీకి 3 నెలలు మాత్రమే! భారత క్రికెట్ అడ్డాలాంటి ముంబై నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఒక తరంలాంటి అంతరం ఉంది. దేశవాళీ క్రికెట్లో వసీం జాఫర్ ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే 22 ఏళ్ల క్రితం అతను తొలి మ్యాచ్ ఆడాడని, ప్రస్తుతం అతని వయసు 40 ఏళ్లంటే నమ్మడం కష్టం. సాక్షి క్రీడావిభాగం: భారత్ తరఫున ఎనిమిదేళ్ల వ్యవధిలో వసీం జాఫర్ 31 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 34.10 సగటుతో 1,944 పరుగులు చేశాడు. వాటిలో 5 సెంచరీలు (2 డబుల్ సెంచరీలు), 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదేమీ పేలవమైన రికార్డు కాదు. కానీ 2008 తర్వాత అతనికి మళ్లీ టీమిండియా అవకాశమే దక్కలేదు. ఆ తర్వాత కూడా రంజీ ట్రోఫీలో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా... అప్పటికే సెహ్వాగ్, గంభీర్ జోడీ నిలదొక్కుకోవడంతో జాఫర్‌కు నిరాశ తప్పలేదు. కానీ అతను మాత్రం దేశవాళీలో భారీగా పరుగులు చేస్తూ పోయాడు. స్కూల్ క్రికెట్లో 400 పరుగుల స్కోరు సాధించినప్పటి నుంచి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్న జాఫర్... ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (10,665) చేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా అతని పరుగుల దాహం తగ్గలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కు పైగా సెంచరీలు సాధించిన ఎనిమిది మంది భారత బ్యాట్స్‌మెన్‌లో జాఫర్ కూడా ఒకడు. ఎనిమిది సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమై, వాటిలో రెండు సార్లు కెప్టెన్‌గా కూడా ఉన్న జాఫర్ కెరీర్ మూడేళ్ల క్రితం మరో మలుపు తిరిగింది. వేర్వేరు కారణాలతో అతను సొంత టీమ్ ముంబై నుంచి విదర్భకు మారాడు. తొలి రెండు సీజన్లు విదర్భ అంతంత మాత్రం ప్రదర్శనే కనబర్చింది. అయితే ఈసారి జాఫర్ సీనియర్ ఆటగాడిగా, మెంటార్‌గా తన బాధ్యతను మరింత సమర్థంగా నిర్వర్తించాడు. తను అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. తాను కూడా 54.09 సగటుతో 595 పరుగులు చేసి విదర్భ తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా రెస్టాఫ్ ఇండియాతో అతని ఇన్నింగ్స్‌పై మాజీ సహచరులు గంగూలీ, లక్ష్మణ్‌లతో సహా అనేక మంది ఆటగాళ్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఐదుగురు మాత్రమే 40 ఏళ్లు దాటిన తర్వాత ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగలిగారు. జాఫర్ దానికి మరో 15 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న అతనికి దీనిని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 6 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వసీం జాఫర్ 18 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, విజయ్ హజారే తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. -
రెస్టాఫ్ ఇండియా లక్ష్యం 480
ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్ ముంబై: ఇరానీ కప్ మ్యాచ్‌లో విజయం కోసం ముంబై జట్టు రెస్టాఫ్ ఇండియాకు 480 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (60), సూర్యకుమార్ యాదవ్ (49) రాణించారు. జయంత్ యాదవ్‌కు 4, ఉనాద్కట్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్ట్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 100 పరుగులు చేసింది. కె.ఎస్.భరత్ (42) ఫర్వాలేదనిపించాడు. చివరి రోజు గురువారం ఆ జట్టు గెలుపు కోసం చేతిలో 9 వికెట్లతో మరో 380 పరుగులు చేయాలి. -
ఆధిక్యంలో కర్ణాటక
- రెండో ఇన్నింగ్స్‌లో 341/6 - రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇరానీ కప్ బెంగళూరు: రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ చాంపియన్ కర్ణాటక జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో జోరు కనబరచడంతో గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో ఆరు వికెట్లకు 341 పరుగులు చేసింది. దీంతో జట్టుకు 321 పరుగుల ఆధిక్యం లభించింది. రవికుమార్ సమర్థ్ (159 బంతుల్లో 81; 10 ఫోర్లు), కరుణ్ నాయర్ (123 బంతుల్లో 80; 12 ఫోర్లు), మనీష్ పాండే (121 బంతుల్లో 73 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. క్రీజులో పాండేతో పాటు కెప్టెన్ వినయ్ (47 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉన్నాడు. రెస్ట్ బౌలర్లు వరుణ్ ఆరోన్, ఓజాలకు రెండేసి వికెట్లు దక్కాయి.