ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్
ముంబై: ఇరానీ కప్ మ్యాచ్‌లో విజయం కోసం ముంబై జట్టు రెస్టాఫ్ ఇండియాకు 480 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 2/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగులకు ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (60), సూర్యకుమార్ యాదవ్ (49) రాణించారు. జయంత్ యాదవ్‌కు 4, ఉనాద్కట్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్ట్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 100 పరుగులు చేసింది. కె.ఎస్.భరత్ (42) ఫర్వాలేదనిపించాడు. చివరి రోజు గురువారం ఆ జట్టు గెలుపు కోసం చేతిలో 9 వికెట్లతో మరో 380 పరుగులు చేయాలి.
రెస్టాఫ్ ఇండియా లక్ష్యం 480
Published Thu, Mar 10 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement