restof India
-
విదర్భ 800/7 డిక్లేర్డ్
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పట్టు బిగించింది. 800/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు అనంతరం ప్రత్యర్థి కీలక వికెట్లు తీసి ఆధిపత్యం కొనసాగించింది. నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ప్రస్తుతం నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 564 పరుగులు వెనుకబడి ఉంది. పేస్ బౌలర్ రజనీశ్ గుర్బానీ (4/46) ధాటికి 98 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (171 బంతుల్లో 81 బ్యాటింగ్; 10 ఫోర్లు), జయంత్ యాదవ్ (62 బ్యాటింగ్; 9 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అభేద్యమైన ఏడో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. ఓపెనర్ పృథ్వీ షా (51; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సమర్థ్ (0), మయాంక్ అగర్వాల్ (11)లతో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్ (21), మరో ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (0), అశ్విన్ (8) విఫలమయ్యారు. అంతకుముందు 702/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ అపూర్వ్ వాంఖడే (157; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారీ స్కోరు చేయగలిగింది. -
ఆదుకున్న చిరాగ్ గాంధీ
► గుజరాత్ తొలి ఇన్నింగ్స్ 300/8 ► రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్ ముంబై: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో చిరాగ్ గాంధీ (159 బంతుల్లో 136 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో గుజరాత్ జట్టును ఆదుకున్నాడు. వరుస వికెట్ల పతనాన్ని తన అద్భుత బ్యాటింగ్‌తో అడ్డుకున్న తన ఆటతీరుతో రంజీ చాంపియన్ గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. దీంతో తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 300 పరుగులు చేసింది. గాంధీకి జతగా ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పటేల్ (9 బ్యాటింగ్) ఉన్నాడు. మన్ ప్రీత్ జునేజా (90 బంతుల్లో 47; 7 ఫోర్లు), ధృవ్ రావల్ (94 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను రెస్టాఫ్ ఇండియా బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ గోహెల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. పేసర్లు సిద్ధార్థ్ కౌల్ (4/73), పంకజ్ సింగ్ (3/77) ధాటికి 82 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టు ఇబ్బందుల్లో పడింది. ఫామ్‌లో ఉన్న ప్రియాంక్ (61 బంతుల్లో 30; 6 ఫోర్లు), కెప్టెన్ పార్థివ్ (11) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఈ దశలో జట్టు ఇన్నింగ్‌్సను నిర్మించే బాధ్యతను 26 ఏళ్ల గాంధీ తీసుకున్నాడు. జునేజాతో కలిసి రెస్టాఫ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీరిద్దరు దాదాపు రెండో సెషన్ అంతా ఆధిపత్యం ప్రదర్శించి ఐదో వికెట్‌కు 110 పరుగులు జత చేశారు.