
సాక్షి, గుంటూరు వెస్ట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 137 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రైల్వేస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. మోనా (92; 10 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్ 16 పరుగులు సాధించింది. విదర్భ 38.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటైంది.
రైల్వేస్ బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొట్టింది. అంతకుముందు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మహిళల అకాడమీలో భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ తన 36వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది.