Breadcrumb
INDW Vs PAKW: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
Published Sun, Mar 6 2022 6:09 AM | Last Updated on Sun, Mar 6 2022 1:39 PM
Live Updates
INDW Vs PAKW: పాకిస్తాన్‌తో భారత్ పోరు
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 137 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్(67),స్నేహ్ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ 7 వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాక్ బౌలర్లలో నిదా ధార్,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్, ఆమీన్ ఒక్కో వికెట్ సాధించారు
విజయానికి వికెట్ దూరంలో భారత్
వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగుతోన్న మ్యాచ్‌లో భారత్ విజయానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. 42 ఓవర్లు ముగిసేసరికి పాక్.. 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గైక్వాడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.
విజయానికి మూడు వికెట్ల దూరంలో భారత్
99 పరుగుల వద్ద పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన ఫాతిమా సానా.. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. భారత్ విజయానికి మూడు వికెట్ల దూరంలో నిలిచింది. 34 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు నష్టానికి 104 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ మూడు వికెట్లు సాధించింది.
గెలుపు దిశగా భారత్.. మరో 4 వికెట్లు
87 పరుగుల వద్ద పాకిస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో రియాజ్ స్టంప్ ఔటైంది. ఇక భారత్ విజయం దాదాపు ఖాయమైనట్లే. 30 ఓవర్లు ముగిసే సరికి పాక్.. 6 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
78 పరుగులకే ఐదు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో పాక్
భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 4 పరుగులు చేసిన నిధా దార్.. గోస్వామి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. క్రీజులో రియాజ్, సనా ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్..
68 పరుగుల వద్ద పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన సిద్రా అమీన్.. గోస్వామి బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 23 ఓవర్లు ముగిసేసరికి పాక్.. 4 వికెట్లు నష్టానికి 70 పరుగులు చేసింది.
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన పాక్..
పాకిస్తాన్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్‌లో మహరూఫ్ ఔట్ కాగా.. స్నేహ్ రానా బౌలింగ్‌లో సోహెల్ పెవిలియన్‌కు చేరింది. ఇక 19 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో సిద్రా అమీన్(27), నిధా ధార్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జవేరియా ఖాన్.. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో గోస్వామికు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.
10 ఓవర్లకు పాక్ స్కోర్: 26/0
245 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో జవేరియా ఖాన్(10),సిద్రా అమీన్(15) పరుగులతో క్రీజులో ఉన్నారు.
పాకిస్తాన్ టార్గెట్ 245 పరుగులు.. చెలరేగిన పూజా
పాకిస్తాన్‌తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్(67),స్నేహ్ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ 7 వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక కెప్టెన్ మిథాలీ(9), హర్మన్ ప్రీత్(5), షఫాలీ వర్మ(0) పరుగులతో నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో నిదా ధార్,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్, ఆమీన్ ఒక్కో వికెట్ సాధించారు.
దుమ్ము రేపిన పూజా..
భారత బౌలర్ పూజా వాస్త్రాకర్ దుమ్ము రేపింది. కష్టాల్లో ఉన్న జట్టును తన విరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. 59 బంతుల్లో 67 పరుగులు చేసింది. అఖరి ఓవర్లో సానా బౌలింగ్‌లో వాస్త్రాకర్ క్లీన్ బౌల్డ్ అయ్యింది.
43 ఓవర్లకు భారత్ స్కోర్: 188/6
వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్,స్నేహ్ రానా అదుకున్నారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ 6 వికెట్లు నష్టానికి 188 పరుగులు చేసింది. క్రీజులో పూజా వస్త్రాకర్(40),స్నేహ్ రానా(31) పరుగులతో ఉన్నారు.
పీకల్లోతు కష్టాల్లో భారత్.. మిథాలీ ఔట్
114 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరింది. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో పూజా వస్త్రాకర్(9),స్నేహ్ రానా(1) పరుగులతో ఉన్నారు.
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన భారత్.. హర్మన్ ప్రీత్ ఔట్
టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. నిధా ధార్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరింది. ఇక క్రీజులో ఉన్న కెప్టెన్ మిథాలీపై జట్టు భారం అంతా పడింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 111/4
టీమిండియాకు భారీ షాక్.. మంధాన ఔట్
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆర్దసెంచరీ సాధించి మంచి ఊపు మీద మంధాన.. అనమ్ అమీన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 25 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 100/3
రెండో వికెట్ కోల్పోయిన భారత్
96 పరుగుల వద్ద దీప్తి శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన దీప్తి.. సంధు బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీజులోకి వచ్చింది. 22 ఓవర్లకు భారత్ స్కోర్: 96/2
20 ఓవర్లకు భారత్ స్కోర్: 87/1
20 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మంధాన(47), దీప్తి శర్మ(34) నిలకడగా ఆడుతోన్నారు.
10 ఓవర్లకు భారత్ స్కోరు : 33/1
మహిళ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డేలో మిథాలీ రాజ్ సేన అచితూచి ఆడుతోంది. పవర్ ప్లేలో మరో వికెట్ కోల్పోకుండా 33/1 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ డకౌట్ కాగా, స్మతి మంధాన 23, దీప్తి శర్మ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్: 5 ఓవర్లకు భారత్ స్కోర్ 15 /1
5 ఓవర్లకు భారత మహిళల జట్టు స్కోర్15 /1. భారత బ్యాట్స్ఉమెన్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం స్మృతి మంధాన(11 ), దీప్తి శర్మ(2) క్రీజులో ఉన్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్: తుది జట్లు ఇవే..
భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ (సి), రిచా ఘోష్ (w), స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయక్వాడ్.
పాకిస్థాన్ మహిళల జట్టు: జవేరియా ఖాన్, సిద్రా అమీన్, బిస్మా మరూఫ్(సి), ఒమైమా సోహైల్, నిదా దార్, అలియా రియాజ్, ఫాతిమా సనా, సిద్రా నవాజ్(w), డయానా బేగ్, నష్రా సంధు, అనమ్ అమీన్.
గత రికార్డులను పరిశీలిస్తే..
మహిళల వన్డే క్రికెట్లో భారత్-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే కావడం విశేషం. ఇక పొట్టి క్రికెట్లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓడిపోయింది.
మహిళల వన్డే ప్రపంచకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత్.. బిస్మా మారూఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచి భారత మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఓవరాల్‌గా 10 వన్డేలు జరగ్గా పదింటిలోనూ భారతే నెగ్గింది.
India win the toss and elect to bat first against arch-rivals Pakistan.
— ICC (@ICC) March 6, 2022
It's almost time for the big game ⌛️#CWC22 pic.twitter.com/79E2q7qBr3
Related News By Category
Related News By Tags
-
INDW Vs PAKW: పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకునేనా..?
India Take On Pakistan In Womens ODI World Cup 2022: గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ...
-
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమ...
-
Asia Cup 2024: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్య...
-
Asia Cup 2024: భారత బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ల...
-
Asia Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ శ్రీలంకలోని డంబుల్లా వేదికగా ఇవాళ (జులై 19) ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్ విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో భారత్, పా...
Comments
Please login to add a commentAdd a comment