శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక విదర్భ అంశాన్ని చేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ అధిష్టానానికి సూచించారు.
నాగపూర్: శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక విదర్భ అంశాన్ని చేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ అధిష్టానానికి సూచించారు. తాను రూపొందించిన విదర్భ అభివృద్ధి మేనిఫెస్టోను పార్టీ మేనిఫెస్టో ప్రతిని మేనిఫెస్టో ప్యానల్ సభ్యుడు సుశీల్‌కుమార్ షిండేకి ఆదివారం అందజేశారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యముందన్నా రు. విదర్భ అభివృద్ధి ఎజెండాను అధిష్టానం ఆమోదించకపోయినట్టయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. మహారాష్ట్రలో అంతర్భాగంగా ఉన్నంతకాలం విదర్భ అభివృద్ధి చెందదన్నారు.