కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే
Karnataka Enters Final Beat Vidarbha By 4 Runs.. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న కర్ణాటక ఫైనల్లో ప్రవేశించింది. విదర్భతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 4 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో విదర్భ గెలుపు ముంగిట బోల్తా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కదమ్(56 బంతుల్లో 87 పరుగులు, 7 సిక్సర్లు, 4 ఫోర్లు) కదం తొక్కడం.. కెప్టెన్ మనీష్ పాండే 54 పరుగులతో సహకరించాడు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు రికార్డు స్థాయిలో 132 పరుగులు జోడించారు. ఆ తర్వాత అభినవ్ మనోహర్ 27 మినహా మిగతావరు పూర్తిగా విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే 4, లలిత్ యాదవ్ 2, యష్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు.
చదవండి: Syed Mustaq Ali T20: హైదరాబాద్ ఘోర ఓటమి.. ఫైనల్లో తమిళనాడు
అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ ఇన్నింగ్స్‌లో పెద్దగా స్కోర్లు నమోదు కానప్పటికి బ్యాట్స్‌మన్ తలో చెయ్యి వేశారు. అథర్వ తైడే 32, గణేష్ సతీష్ 31 పరుగులు చేశారు. కర్ణాటక బౌలింగ్‌లో కెసి కరియప్ప 2, విద్యాదర్ పాటిల్, దర్శన్ ఎంబి, జగదీష్ సుచిత్, కరుణ్ నాయర్ తలా ఒక వికెట్ తీశారు. ఫైనల్లో ప్రవేశించిన కర్ణాటక.. తమిళనాడుతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరగింది. అప్పుడు తమిళనాడుపై గెలిచి కర్ణాటక ట్రోఫీని అందుకుంది.
చదవండి: Shaheen Afridi: సిక్స్ కొట్టాడని కసితీరా కొట్టాడు.. క్షమాపణ ఎందుకు షాహిన్?
Comments
Please login to add a commentAdd a comment