ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్‌.. సూపర్‌ ఓవర్‌ ద్వారా సెమీస్‌కు | Syed Mushtaq Ali T20: Karnataka Beats Bengal Super Over Enter Semifinals | Sakshi
Sakshi News home page

Syed Mustaq Ali T20 Trophy: ఆఖరి బంతికి ఊహించని ట్విస్ట్‌.. సూపర్‌ ఓవర్‌ ద్వారా సెమీస్‌కు

Published Thu, Nov 18 2021 6:14 PM | Last Updated on Thu, Nov 18 2021 6:47 PM

Syed Mushtaq Ali T20: Karnataka Beats Bengal Super Over Enter Semifinals - Sakshi

Karnataka Beats Bengal In Super Over Enter Semis.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో భాగంగా కర్ణాటక, బెంగాల్‌ మధ్య గురువారం  క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆఖరి ఓవర్‌దాకా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో అద్భుత విజయం సాధించిన కర్ణాటక సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ 55 పరుగులు నాటౌట్‌.. టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్‌ రోహన్‌ కడమ్‌ 30, కెప్టెన్‌ మనీష్‌ పాండే 29 పరుగులు చేశారు.

చదవండి: Ind Vs Nz 1st T20: సిరాజ్‌ను ‘కొట్టిన’ రోహిత్‌ శర్మ.. ‘ఏంటి భయ్యా ఇది’.. వీడియో వైరల్‌!

అనంతరం బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ 19 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో బెంగాల్‌ విజయానికి 20 పరుగులు కావాలి. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను విద్యాదర్‌ పాటిల్‌ వేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న రిత్విక్‌ చౌదరీ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలచడంతో.. నాలుగు బంతుల్లో 8 పరుగులుగా సమీకరణాలు మారాయి. మూడో బంతికి ఒక పరుగు రాగా.. నాలుగో బంతికి ఆకాశ్ దీప్‌ బౌండరీ బాదడంతో రెండు బంతుల్లో మూడు పరుగులు కావాలి. ఐదో బంతికి ఆకాశ్‌ దీప్‌ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే బెంగాల్‌ విజయం సాధిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది.  పాటిల్ వేసిన బంతిని ఆకాశ్‌ దీప్‌ డీప్‌మిడ్‌వికెట్ దిశగా షాట్ ఆడాడు. అయితే అక్కడే ఉన్న కెప్టెన్‌ మనీష్‌ పాండే డైరెక్ట్ హిట్‌ చేయడంతో ఆకాశ్‌ దీప్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ టై అయి సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. 

ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ నాలుగు బంతుల్లో 5 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.ఇక 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటకను మనీష్‌ పాండే రెండు బంతుల్లోనే 8 పరుగులు కొట్టి విజయం అందించి జట్టును సెమీఫైనల్‌ చేర్చాడు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో మిగిలిన క్వార్టర్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కేరళపై తమిళనాడు, గుజరాత్‌పై హైదరాబాద్‌, రాజస్తాన్‌పై విదర్భలు విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక సెమీస్‌లో తమిళనాడుతో హైదరాబాద్‌.. కర్ణాటకతో విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

చదవండి: Ricky Ponting: హెడ్‌కోచ్‌గా ఆఫర్‌.. ద్రవిడ్‌ను ఎంపికచేయడం ఆశ్చర్యపరిచింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement