Faiz Fazal
-
'ఆ ఒక్క మ్యాచ్‌తోనే నా కెరీర్‌కు ఎండ్ కార్డ్.. చాలా బాధపడ్డా'
భారత్ తరపున అరంగేట్రం చేసి కనుమరుగు అయిపోయిన క్రికెటర్లలో విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఒకరు. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫజల్.. తన తొలి మ్యాచ్‌లోనే అకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఫజల్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కానీ దురదృష్టవశాత్తూ భారత జట్టుతో తన ప్రయాణం తొలి మ్యాచ్‌తోనే ఆగిపోయింది. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అకట్టుకున్నప్పటికి అతడికి ఆ తర్వాత భారత జట్టులో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో ఇటీవలే ప్రొఫెషనల్ క్రికెట్‌కు ఫజల్ విడ్కోలు పలికాడు. 2023-24 రంజీ సీజన్లో హర్యానాతో మ్యాచ్ అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి ఫజల్ తప్పుకున్నాడు. అయితే తాజాగా టీమిండియా తరపున కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడటంపై ఫజల్ స్పందించాడు. తొలి మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికి తర్వాత భారత్‌కు ఆడే అవకాశాలు రాకపోవడంతో చాలా బాధపడ్డానని ఫజల్ తెలిపాడు. "నేను చాలా ఎమోషనల్. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడతాను. అదే విధంగా ఆ చిన్న విషయాలే నన్ను సంతోష పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టీమిండియా తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను టీమిండియా క్యాప్‌ను అందుకోగానే నా ఫ్యామిలీ కూడా చాలా సంతోష పడ్డారు. కానీ ఒక్క మ్యాచ్‌తో నా సంతోషం ఆవిరి అయిపోయింది. వెనక్కి తిరిగి నా కెరీర్‌ను చూస్తే కేవలం ఒకే మ్యాచ్ కన్పిస్తోంది. దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు మరి ఛాన్స్ లభించలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఇంకో విషయమేంటంటే అప్పటి జట్టులో నేను ఒక్కడినే ఐపీఎల్లో ఆడలేదని" ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫజల్ పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్..
టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫైజ్ ఫజల్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫైజ్ ఫజల్ వెల్లడించాడు. "విదర్భ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. గత 21 ఏళ్లగా విదర్భ క్రికెట్‌తో ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయి. నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ప్రయాణం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ముగించాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు. కానీ నా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావించాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిని సహచరులు, కోచ్‌లు, ఫిజియోలు, ఫ్యామిలీ, అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఫజల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఫైజ్ ఫజల్ 2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జమ్మూ కాశ్మీర్‌పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 113 మ్యాచ్‌లు ఆడిన అతడు 3,641 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫైజ్.. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయతే దురదృష్టవశాత్తూ తర్వాత అతడికి జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం మళ్లీ రాలేదు. View this post on Instagram A post shared by Faiz Fazal (@faizfazal24) -
అటు తిలక్... ఇటు భుయ్
సూరత్: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ 113 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తిలక్‌వర్మ (145 బంతుల్లో 156; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా, తన్మయ్ అగర్వాల్ (100 బంతుల్లో 86; 9 ఫోర్లు) రాణించాడు. అనంతరం త్రిపుర 42 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. సీవీ మిలింద్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇండోర్: ఆంధ్ర 3 వికెట్లతో పటిష్టమై న విదర్భను ఓడించింది. విదర్భ 50 ఓవర్లలో 6 వికెట్లకు 331 పరుగులు చేసింది. యష్ (113 బంతుల్లో 117; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫైజ్ ఫజల్ (105 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. అనంతరం ఆంధ్ర 49.2 ఓవర్లలో 7 వికె ట్లకు 332 పరుగులు సాధించింది. రికీ భుయ్ (78 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫో ర్లు, 6 సిక్స ర్లు) అజేయ శతకం బాదగా, కెప్టెన్ హనుమ విహారి (67 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. -
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
-
అంపైర్ నిద్రపోయావా ఏంటి?
నాగ్‌పూర్: క్రికెట్లో రోజురోజుకి అంపైర్ల చర్యలు, తప్పిద నిర్ణయాల పట్ల విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అంపైర్ల తప్పిద నిర్ణయాలతో అనేక జట్లు గెలిచే మ్యాచ్‌లు ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పిద నిర్ణయాలతో అంపైర్లు అభాసుపాలవుతుండగా.. తాజాగా దేశవాళీ మ్యాచ్‌లో అంపైర్ సీకే నందన్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా-విదర్భ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్ ఫయాజ్ ఫజల్ అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్ వేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ ఫయాన్స్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు. దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్ మరో ఫీల్డ్ అంపైర్ వైపు చూసి.. ఔటంటూ వేలెత్తాడు. దీంతో.. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు మొదలెట్టగా.. నాటౌట్ అని సంతోషించిన ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం భారంగా క్రీజు వదిలాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. అంపైర్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ అంపైర్ నిద్రపోయావా ఏంటి’ అంటూ కొందరు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి’అంటూ మరికొందరు సూచిస్తున్నారు. -
నాయర్ స్థానంలో ఫైజల్ కు ఛాన్స్
హరారే: టీమిండియాతో బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయిన సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు చివరి మ్యాచ్ లోనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పలు మార్పులతో బరిలోకి దిగుతోంది. మాల్కమ్ వాలర్, టిమిసెన్ మారుమా, తవాండా ముపారివా, నెవిల్ మజ్దివా, డొనాల్డ్ టిరిపానో జట్టులోకి వచ్చారు. టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది. కరుణ్ నాయర్ స్థానంలో ఫయజ్ ఫైజల్ ను తీసుకున్నారు. తొలి వన్డే ఆడుతున్న ఫైజల్ కు కెప్టెన్ ఎంఎస్ ధోని ఇండియా క్యాప్ అందజేశాడు. విదర్భ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడుతున్న మూడో ప్లేయర్ గా ఫైజల్ గుర్తింపు పొందాడు. ప్రశాంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ అతడికంటే ముందు టీమిండియా తరపున ఆడారు.