నాయర్‌ స్థానంలో ఫైజల్‌ కు ఛాన్స్ | third cricketer from Vidarbha to play for India | Sakshi
Sakshi News home page

నాయర్‌ స్థానంలో ఫైజల్‌ కు ఛాన్స్

Published Wed, Jun 15 2016 12:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

third cricketer from Vidarbha to play for India

హరారే: టీమిండియాతో బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయిన సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు చివరి మ్యాచ్ లోనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పలు మార్పులతో బరిలోకి దిగుతోంది. మాల్కమ్ వాలర్, టిమిసెన్ మారుమా, తవాండా ముపారివా, నెవిల్ మజ్దివా, డొనాల్డ్ టిరిపానో జట్టులోకి వచ్చారు.

టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది. కరుణ్ నాయర్‌ స్థానంలో ఫయజ్ ఫైజల్‌ ను తీసుకున్నారు. తొలి వన్డే ఆడుతున్న ఫైజల్‌ కు కెప్టెన్ ఎంఎస్ ధోని ఇండియా క్యాప్ అందజేశాడు. విదర్భ ప్రాంతం నుంచి టీమిండియాకు ఆడుతున్న మూడో ప్లేయర్ గా ఫైజల్ గుర్తింపు పొందాడు. ప్రశాంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ అతడికంటే ముందు టీమిండియా తరపున ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement