టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫైజ్ ఫజల్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫైజ్ ఫజల్ వెల్లడించాడు.
"విదర్భ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. గత 21 ఏళ్లగా విదర్భ క్రికెట్‌తో ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయి. నా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ప్రయాణం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ముగించాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు.
కానీ నా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావించాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిని సహచరులు, కోచ్‌లు, ఫిజియోలు, ఫ్యామిలీ, అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఫజల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఫైజ్ ఫజల్ 2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే జమ్మూ కాశ్మీర్‌పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 137 మ్యాచ్‌లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో 113 మ్యాచ్‌లు ఆడిన అతడు 3,641 పరుగులు చేశాడు.
ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో ధోని సారథ్యంలో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫైజ్.. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయతే దురదృష్టవశాత్తూ తర్వాత అతడికి జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం మళ్లీ రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment