టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు.
ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్‌తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్‌కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.
తీరు మారని రోహిత్..
కాగా రోహిత్ శర్మ రెడ్‌బాల్ ఫార్మాట్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.
అంతకముందు న్యూజిలాండ్ సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా హిట్‌మ్యాన్ తన బ్యాట్‌కు పనిచెబుతాడో లేదో చూడాలి.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Rohit Sharma out for 3 in 19 😶
Embarrass!ng #RohitSharma
pic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025
Comments
Please login to add a commentAdd a comment