టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.
ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఫెయిల్
కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్‌వాష్‌కు గురైంది.
అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.
రంజీల్లోనైనా రాణిస్తాడని
ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.
ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్‌తో మొదలైన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.
వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేసి.. మరోసారి విఫలమై
ఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్‌లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu
— HitMan (@HitMan_4545) January 24, 2025
జైసూ, గిల్, పంత్ కూడా అంతే
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఉమర్ నజీర్ బౌలింగ్‌లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్‌వీర్ సింఘ్ బౌలింగ్‌లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు.
జమ్మూ కశ్మీర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది.
మరోవైపు.. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం.
చదవండి: Ind vs Engఅతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n
— kuldeep singh (@kuldeep0745) January 24, 2025
Comments
Please login to add a commentAdd a comment