Vijay Hazare ODI tourney
-
ఏడు ఇన్నింగ్స్‌లో 752 రన్స్.. అసాధారణం: సచిన్ టెండుల్కర్
భారత క్రికెటర్ కరుణ్ నాయర్(Karun Nair)పై టీమిండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రశంసల వర్షం కురిపించాడు. ఏడు ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదు శతకాలు బాదడం గాలివాటం కాదని.. కఠోర శ్రమ, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నాడు. కరుణ్ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సచిన్ ఆకాంక్షించాడు.ఐదు సెంచరీల సాయంతోకాగా రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చాలా కాలం పాటు కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2023-24 సీజన్ నుంచి అతడు విదర్భకు ఆడుతున్నాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy) సీజన్లో 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.యాభై ఓవర్ల ఫార్మాట్లో కరుణ్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏకంగా 752 పరుగులు రాబట్టాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. ఏడు ఇన్నింగ్స్‌లోనూ అజేయంగా నిలవడం మరో విశేషం. ఇక కెప్టెన్‌గానూ కరుణ్ నాయర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. బ్యాటర్‌గా ఆకట్టుకుంటూనే సారథిగానూ సరైన వ్యూహాలతో విదర్భను తొలిసారి ఈ వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు టీమిండియా సెలక్టర్లు పిలుపునివ్వాలని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అతడిని ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ సైతం కరుణ్ నాయర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో‘‘కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాల సాయంతో 752 పరుగులు.. ఇది అసాధారణ విషయం కరుణ్ నాయర్!.. ఇలాంటి ప్రదర్శనలు కేవలం ఒక్కరోజులోనే సాధ్యం కావు. ఇందుకు ఆట పట్ల అంకిత భావం, దృష్టి ఉండాలి. కఠిన శ్రమతోనే ఇలాంటివి సాధ్యమవుతాయి. ఇదే తీరుగా ధైర్యంగా ముందుకు వెళ్లు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో’’ అని సచిన్ టెండ్కులర్ ‘ఎక్స్’ వేదికగా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం జట్టును ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించనున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీ ఆడతాడా? లేదా? అన్నది ఈ సందర్భంగా తేలనుంది.నా అంతిమ లక్ష్యం అదేఇక చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వాలంటూ టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బలంగా తన గొంతును వినిపించాడు. అయితే, మరో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మాత్రం కరుణ్‌ను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం లేదంటూ కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే.. పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ మాత్రం తనకు మరోసారి భారత్ తరఫున ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.‘‘దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడికి ఉంటుంది. నా కల కూడా ఇంకా సజీవంగానే ఉంది. అందుకే నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాను. ఏదో ఒకరోజు మళ్లీ టీమిండియాలో అడుగుపెడతా. నా ఏకైక, అంతిమ లక్ష్యం అదే’’ అని కరుణ్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎనిమిదేళ్ల క్రితంకాగా 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ చివరగా 2017లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడిన కరుణ్ నాయర్ ఖాతాలో 374 పరుగులు ఉన్నాయి, ఇందులో త్రిబుల్ సెంచరీ(303) ఉంది. ఇక రెండు వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
వారెవ్వా!.. కరుణ్ నాయర్ ఐదో సెంచరీ.. సెమీస్‌లో విదర్భ
దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో హరియాణా, విదర్భ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించగా... హరియాణా జట్టు 2 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టును ఓడించింది.విదర్భతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ (62; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ గర్వాల్ (59; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... దీపక్ హుడా (45; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ చహర్ (14 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (32) తలా కొన్ని పరుగులు చేశారు.విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అయితే సీనియర్ ప్లేయర్ కరుణ్ నాయర్ (82 బంతుల్లో 122 నాటౌట్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు ముందు రాజస్తాన్ స్కోరు సరిపోలేదు. ‘శత’క్కొట్టిన ధ్రువ్ షోరేఈ సీజన్లో వరుస సెంచరీలతో రికార్డులు తిరగరాస్తున్న విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ రాజస్తాన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. అతడితో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షోరే(Dhruv Shorey- 131 బంతుల్లో 118 నాటౌట్, 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో విదర్భ జట్టు 43.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 292 పరుగులు చేసి గెలిచింది.కరుణ్ నాయర్ ఐదో సెంచరీటీమిండియా ప్లేయర్లు దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ హుడా(Deepak Hooda) బౌలింగ్‌లో ధ్రువ్, కరుణ్ జంట పరుగుల వరద పారించింది. యశ్ రాథోడ్ (39) త్వరగానే అవుటవ్వగా... ధ్రువ్, కరుణ్ అబేధ్యమైన రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించారు. తాజా సీజన్లో వరుసగా నాలుగు (ఓవరాల్‌గా 5) శతకాలు బాదిన కరుణ్ నాయర్... విజయ్ హజారే టోర్నీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నారాయణ్ జగదీశన్ (5 శతకాలు; 2022–23లో) సరసన చేరాడు.ఈ టోర్నీలో ఇప్పటి వరకు 664 పరుగులు చేసిన 33 ఏళ్ల కరుణ్ నాయర్ అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం జరగనున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్రతో విదర్భ తలపడుతుంది. హరియాణా ఆల్‌రౌండ్ షో గుజరాత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హరియాణా సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 45.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. హేమంగ్ పటేల్ (54; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరవగా... చింతన్ గాజా (32; 4 ఫోర్లు), ఉర్విల్ పటేల్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆర్య దేశాయ్ (23; 5 ఫోర్లు), సౌరవ్ చౌహాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు.కెప్టెన్ అక్షర్ పటేల్ (3) విఫలమయ్యాడు. హరియాణా బౌలర్లలో అనూజ్ ఠక్రాల్, నిశాంత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో హరియాణా 44.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. హిమాన్షు రాణా (66; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లు తీశాడు. అనూజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బుధవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో కర్ణాటకతో హరియాణా జట్టు తలపడనుంది. చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్Karun Nair is the No 3 India deserves in ODI cricketThis was the reason Kohli never promoted him in cricket. pic.twitter.com/L9hmVtHGAE— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 12, 2025 -
Ind vs Eng: నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్ ఇచ్చిన భారత పేసర్!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనానికి సై అంటున్నాడు. ఇప్పటికే దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ బెంగాల్ బౌలర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆకట్టుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో(42 పరుగులు నాటౌట్)నూ సత్తా చాటిన షమీ.. తాజాగా ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో బంతితో రాణించాడు.వడోదర వేదికగా తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ - హర్యానా(Haryana vs Bengal) మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హర్యానాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అర్ష్ రంగా(23), హిమాన్షు రాణా(14) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ అంకిత్ కుమార్(18) కూడా నిరాశపరిచాడు.రాణించిన మిడిలార్డర్ బ్యాటర్లుఅయితే, మిడిలార్డర్లో పార్థ్ వత్స్(62), నిశాంత్ సింధు(64) మాత్రం దుమ్ములేపారు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. మిగిలిన వాళ్లలో రాహుల్ తెవాటియా(29) ఫర్వాలేదనిపించగా.. ఎనిమిదో స్థానంలో వచ్చిన సుమిత్ కుమార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి హర్యానా 298 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు.. వికెట్లు తీయడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. హర్యానాతో మ్యాచ్‌లో షమీ పది ఓవర్లు బౌల్ చేసి.. 61 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆరంభంలో ఓపెనర్ హిమాన్షు రాణాను అవుట్ చేసిన షమీ.. డెత్ ఓవర్లలో దినేశ్ బనా(15), అన్షుల్ కాంబోజ్(4)లను వెనక్కి పంపాడు.సర్జరీ తర్వాత నో రీ ఎంట్రీఇలా ఓవరాల్‌గా తన ప్రదర్శన ద్వారా షమీ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. మిగతా బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు, సయాన్ ఘోష్, ప్రదీప్త ప్రామాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా షమీ టీమిండియాకు చివరగా ఆడాడు.స్వదేశంలో జరిగిన నాటి ఐసీసీ టోర్నీలో ఈ రైటార్మ్ పేసర్ 24 వికెట్లతో సత్తా చాటాడు. చీలమండ గాయం వేధిస్తున్నా ఈ మెగా ఈవెంట్లో కొనసాగిన షమీ.. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన మహ్మద్ షమీ.. ఇంత వరకు భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.నేను సిద్ధం.. సెలక్టర్లకు మెసేజ్!కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. పదకొండు వికెట్లు తీసినా.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అతడిని పక్కనపెట్టారు. టెస్టుల్లో బౌలింగ్ చేసే స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదన్న కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. అయితే, తదుపరి టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో షమీ పది ఓవర్ల కోటా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి.. తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి రెస్ట్!
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత బ్యాటర్ల వైఫల్యమే అని చెప్పవచ్చు. ఇక ఆటలో గెలుపోటములు సహజం కాబట్టి.. టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై దృష్టి సారించనుంది.ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడిన టీమిండియా స్టార్లలో కొందరు.. స్వదేశంలో అడుగుపెట్టగానే దేశీ టోర్నీలో పాల్గొనేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో భాగం కానున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతిఅయితే, కేఎల్ రాహుల్‌ను కూడా ఈ టోర్నీలో ఆడాలని యాజమాన్యం సూచించగా.. అతడు తనకు విశ్రాంతి కావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. దేవ్‌దత్ పడిక్కల్ పెర్త్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. నిరాశపరిచిన పడిక్కల్అయితే, తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై పూర్తిగా నిరాశపరిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత మళ్లీ అతడు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.వాషీకే పెద్దపీటఇక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు మాత్రం ఈ సిరీస్‌లో ప్రాధాన్యం దక్కింది. రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని మరీ.. టీమిండియా మేనేజ్మెంట్ వాషీ వైపు మొగ్గుచూపింది. అందుకు తగ్గట్లుగానే వాషీ రాణించాడు. అవసరమైన వేళ బ్యాట్ ఝులిపించడంతో పాటు వికెట్లు తీయడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు ఈ చెన్నై చిన్నోడు.ప్రసిద్ హిట్అయితే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు పేస్ దళంలో ఆకాశ్ దీప్తో పోటీలో వెనుకబడ్డ ప్రసిద్ కృష్ణకు ఆఖరి టెస్టులో అవకాశం వచ్చింది. సిడ్నీ టెస్టుకు ముందు ఆకాశ్ దీప్ గాయపడిన కారణంగా.. ప్రసిద్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తీసి.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు ఈ కర్ణాటక యువ పేసర్.నాకౌట్ మ్యాచ్‌ల బరిలోఇక పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణ తదుపరి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లపై కూడా కన్నేశారు. సీనియర్లు విశ్రాంతి పేరిట దూరమయ్యే పరిస్థితుల నేపథ్యంలో అవకాశాన్ని ఒడిసిపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.కాగా గురువారం (జనవరి 9) నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రి క్వార్టర్ పైనల్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. తమిళనాడు, రాజస్తాన్, హర్యానా, బెంగాల్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మరోవైపు.. అద్భుత ప్రదర్శనతో టాప్-6లో నిలిచిన గుజరాత్, విదర్భ, కర్ణాటక, బరోడా, మహారాష్ట్ర, పంజాబ్ నేరుగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలుఈ నేపథ్యంలో తమిళనాడు తరఫున వాషీ, కర్ణాటక తరఫున ప్రసిద్ కృష్ణ, దేవ్‌దత్ పడిక్కల్ బరిలో దిగనున్నారు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. తొలుత ఐదు టీ20లు.. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లు జరుగుతాయి.చదవండి: ‘బవుమా అలాంటి వాడు కాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’ -
భీకర ఫామ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్-అభిషేక్ శర్మ.. 644 పరుగులతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)- అభిషేక్ శర్మ(Abhishek Sharma) దుమ్ములేపుతున్నారు. అద్బుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఈ ఓపెనింగ్ జోడీ అరుదైన రికార్డు సాధించింది.సౌరాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా తొలి వికెట్‌కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్- ప్రభ్‌సిమ్రన్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా నిలిచారు. ఇక తాజాగా హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఈ జోడీ ధనాధన్ దంచికొట్టింది.మళ్లీ శతక్కొట్టాడు!అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ అభిషేక్ శర్మ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా ప్రభ్‌సిమ్రన్ 105 బంతుల్లో ఏకంగా 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. అభిషేక్ 72 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 93 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 145 బంతుల్లో 196 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.426 పరుగుల భారీ స్కోరుమిగిలిన బ్యాటర్లలో అన్మోల్ప్రీత్ సింగ్(46), రమణ్‌దీప్ సింగ్(80), నేహాల్ వధేరా(35 నాటౌట్), నమన్ ధీర్(14 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.అత్యధిక పరుగుల వీరుడిగాహైదరాబాద్ బౌలర్లలో ముదస్సిర్, శరణు నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి సగటున 473 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 150 నాటౌట్. మరోవైపు.. పంజాబ్ సారథి అభిషేక్ శర్మ ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీల సాయంతో 397 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 170. ఏకంగా 644 పరుగులుఇక ఈ ప్రదర్శనలతో.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ భారత సెలక్టర్లకు గట్టి సందేశం పంపించినట్లయింది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడటం ఖాయంగానే అనిపిస్తున్నా.. ఈసారైనా ప్రభ్‌సిమ్రన్‌ను సెలక్టర్లు కనికరిస్తారేమో చూడాలి!కాగా విజయ్ హజారే ట్రోఫీలో గత మూడు మ్యాచ్‌లలో కలిపి ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ జోడీ ఏకంగా 644 పరుగులు(150, 298, 196) సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది! -
హ్యాట్రిక్ సెంచరీల వీరుడికి షాక్.. వరుణ్ వీరోచిత శతకంతో..
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.తిలక్ వర్మ @99ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది. కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.వరుణ్ వీరోచిత శతకంతిలక్, వరుణ్ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్‌గా నిలిచి హైదరాబాద్‌ను గెలిపించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌తో హైదరాబాద్ ఆడుతుంది. చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ ఊచకోత.. విధ్వంసకర శతకాలతో రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర శతకంతో మెరిశాడు. సౌరాష్ట్ర బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అభిషేక్‌తో పాటు మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతక్కొట్టాడు. ఈ క్రమంలో అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ జోడీ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25- వీహెచ్‌టీ)లో సరికొత్త రికార్డు సాధించింది.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ వీహెచ్‌టీలో భాగంగా పంజాబ్ మంగళవారం నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అదిరిపోయే ఆరంభం అందించారు.అరవై బంతుల్లోనేఅభిషేక్ శర్మ అరవై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 96 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 170 పరుగులు సాధించాడు. మరో ఎండ్ నుంచి అభిషేక్‌కు సహకారం అందించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్.. 95 బంతుల్లో 125 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం.అరుదైన రికార్డుఈ క్రమంలో అభిషేక్ శర్మ- ప్రభ్‌సిమ్రన్ కలిసి తొలి వికెట్‌కు 298 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు(highest first-wicket partnership) జోడించిన రెండో జంటగా నిలిచారు. బెంగాల్ బ్యాటర్లు సుదీప్ ఘరామి- అభిమన్యు ఈశ్వరన్ 2022లో సాధించిన రికార్డును సమం చేశారు.వీరిది మాత్రం ప్రపంచ రికార్డుఇక ఈ టోర్నీలో తొలి వికెట్‌కు అత్యధికంగా 416 పరుగులు జతచేసిన జోడీ తమిళనాడు స్టార్లు నారాయణ్ జగదీశన్, బి. సాయి సుదర్శన్ టాప్‌లో కొనసాగుతున్నారు. కేవలం విజయ్ హజారే ట్రోఫీలోనే కాకుండా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో హయ్యస్ట్ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా వీరు ప్రపంచ రికార్డు కూడా సాధించారు.300 పైచిలుకు స్కోరుఇదిలా ఉంటే..ప్రణవ్ కరియా బౌలింగ్‌లో జే గోహిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మరోసారి ప్రణవ్ కరియా తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించగా.. రుచిత్ అహిర్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక అభిషేక్- ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఊచకోత కారణంగా పంజాబ్ కేవలం 34 ఓవర్లలోనే 300 పరుగుల మార్కు దాటింది.వరుస విజయాలకు కర్ణాటక బ్రేక్కాగా విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో పంజాబ్ తొలి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. తదుపరి నాగాలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అనంతరం కర్ణాటకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ముంబైని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి మళ్లీ విజయాల బాట పట్టింది. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ గెలుపొంది గ్రూప్-‘సి’లో మరింత పటిష్ట స్థితికి చేరాలని పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టులకు రోహిత్ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం! -
తిలక్ వర్మ విఫలం.. హైదరాబాద్‌ను గెలిపించిన సీపీ తనయుడు
విజయ్ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy 2024-25) ఎడిషన్‌లో హైదరాబాద్ రెండో గెలుపు నమోదు చేసింది. పుదుచ్చేరితో శనివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీవీ మిలింద్ అద్భుత బౌలింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.కాగా డిసెంబరు 21 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆరంభం కాగా.. హైదరాబాద్ తొలుత నాగాలాండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం ముంబై చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన తిలక్ సేన.. ఆ తర్వాత సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.ఆకాశమే హద్దుగా చెలరేగిన సీవీ మిలింద్ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా శనివారం పుదుచ్చేరితో తలపడిన హైదరాబాద్.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్(CV Milind) ఆకాశమే హద్దుగా చెలరేగి.. పాండిచ్చేరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టాపార్డర్‌లో ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు(2), అజయ్ రొహేరా(0)లతో పాటు.. మిడిలార్డర్లో ఫాబిద్ అహ్మద్(7).. అదే విధంగా లోయర్ ఆర్డర్లో అంకిత్ శర్మ(6), గౌరవ్ యాదవ్(13) రూపంలో ఐదు వికెట్లు(5/13) దక్కించుకున్నాడు.సీవీ మిలింద్కు తోడుగా తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లతో రాణించగా.. ముదాసిర్, శరణు నిశాంత్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్ బౌలర్ల ధాటికి పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.తిలక్ మరోసారి విఫలం.. రాణించిన హిమతేజఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(0), నితేశ్ రెడ్డి(5).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ తిలక్ వర్మ(6) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కొడిమెల హిమతేజ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. తనయ్ త్యాగరాజన్ 22 పరుగులతో అతడికి సహకారం అందించాడు. ఆఖర్లో వరుణ్ గౌడ్ 13(నాటౌట్) చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి తిలక్ సేన 102 పరుగులు చేసి.. పుదుచ్చేరిపై విజయం సాధించింది.సీపీ తనయుడుకాగా సీవీ మిలింద్ మరెవరో కాదు.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కుమారుడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 30 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇక సీవీ ఆనంద్ కూడా అండర్-19 స్థాయిలో క్రికెట్ ఆడారన్న విషయం తెలిసిందే.తిలక్ వర్మ వరుస వైఫల్యాలుఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో వచ్చిన అవకాశాన్ని టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. సారథిగానూ, బ్యాటర్‌గానూ అతడు విఫలమమవుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తిలక్ చేసిన పరుగులు 0, 0, 57, 6. సారథిగానూ చిన్న జట్లపై గెలిపించాడే తప్ప.. పెద్ద జట్లపై విజయం అందించలేకపోతున్నాడు.చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి! -
సంజూ శాంసన్‌కు భారీ షాక్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళ క్రికెట్ అసోసియేషన్ అతడి విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కేరళకు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.అప్పుడు కెప్టెన్గాఇటీవల దేశీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళ జట్టుకు సంజూ శాంసన్(Sanju Samsom) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సారథ్యంలో కేరళ కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ఈ టోర్నమెంట్లో సంజూ ఆరు మ్యాచ్‌లు ఆడి 135 పరుగుల చేయగలిగాడు.ఈ క్రమంలో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25) నేపథ్యంలో సంజూ శాంసన్‌కు మొండిచేయి ఎదురైంది. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) తాము ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో సంజూకు చోటివ్వలేదు. అందుకే అతడిని ఎంపిక చేయలేదుఈ విషయం గురించి కేసీఏ కార్యదర్శి వినోద్ ఎస్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘డిసెంబరు 13- 17 వరకు విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ కోసం నిర్వహించే సన్నాహక శిబిరానికి హాజరు కాలేనని సంజూ మాకు ఇ- మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు.అయితే, సెలక్షన్ ప్రక్రియ ప్రకారం.. ఈ శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్ల పేర్లనే జట్టు ఎంపిక సమయంలో మేము పరిగణనలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నాడు. అందుకే సంజూ శాంసన్‌ను తాము పక్కనపెట్టినట్లు వినోద్ ఎస్ కుమార్ స్పష్టం చేశాడు.ఇక తాజా సమాచారం ప్రకారం.. తాను దేశీ వన్డే టోర్నీకి అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ కేసీఏకు తెలిపాడు. కానీ.. సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి వినోద్ ఎస్ కుమార్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడాడు.సంజూ వస్తానన్నాడు.. కానీ మా జట్టు నిండుగా ఉంది‘‘తాను జట్టుకు అందుబాటులో ఉంటానని సంజూ శాంసన్ రెండు రోజుల క్రితమే మాకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఇప్పటి వరకు ఈ విషయమై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఈ టోర్నీ ఆడేందుకు కేరళకు చెందిన పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉంది’’ అని వినోద్ కుమార్ పేర్కొన్నాడు. తద్వారా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.అదే జరిగితే.. సంజూకి కష్టమే!కాగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(వన్డే)-2025 మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ ఐసీసీ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలంటే సంజూకు విజయ్ హజారే ట్రోఫీ రూపంలో అవకాశం వచ్చింది. అయితే, కారణాలేవైనా అతడు.. ఈ దేశీ వన్డే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం.. కేసీఏకు రుచించలేదు. దీంతో ఇప్పుడు స్వయంగా అందుబాటులోకి వచ్చినా.. అతడి పట్ల విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టోర్నీ మొత్తంలో ఆడే అవకాశం రాకపోతే సంజూకు చాంపియన్స్ ట్రోఫీ ఆడే మార్గం దాదాపుగా మూసుకుపోయినట్లే! ఇక విజయ్ హజారే ట్రోఫీలో కేరళకు శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో బరోడా చేతిలో చిత్తుగా ఓడిన కేరళ.. రెండో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడింది. అయితే, వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ప్రొటిస్ గడ్డపై శతకాల మోతకాగా సంజూ శాంసన్ చివరగా టీమిండియా తరఫున సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. నవంబరులో ముగిసిన ఈ సిరీస్‌లో సంజూ రెండు శతకాలు బాది.. టీమిండియా ప్రొటిస్ జట్టుపై నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. కేరళ తరఫున ఇప్పటి వరకు 119 లిస్ట్-‘ఎ’(వన్డే ఫార్మాట్)మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్.. 3487 పరుగులు సాధించాడు.చదవండి: నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేయండి.. అప్పుడైనా..: టీమిండియా దిగ్గజం -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత.. విధ్వంసకర శతకం! సెలక్టర్లకు మెసేజ్
విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం(Ruturaj Gaikwad Century) బాదాడు. సర్వీసెస్ జట్టు బౌలింగ్‌పై విరుచుకుపడుతూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి మహారాష్ట్రను విజయతీరాలకు చేర్చాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ(Vijay Hazare Trophy 2024-25)లో భాగంగా మహారాష్ట్ర.. సోమవారం సర్వీసెస్‌తో తలపడింది. ముంబైలోని శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది.రాణించిన సర్వీసెస్ కెప్టెన్ఈ క్రమంలో బ్యాటింగ్‌కు సర్వీసెస్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మోహిత్ అహ్లావత్(61) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్ సూరజ్ వశిష్ట్(22), మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పలివాల్(22), అర్జున్ శర్మ(24), పూనం పూనియా(26) ఫర్వాలేదనిపించారు.మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్ దాధే, సత్యజీత్ బచ్చవ్ మూడేసి వికెట్లు కూల్చగా.. ముకేశ్ చౌదరి రెండు, అజిమ్ కాజీ, రజ్నీశ్ గుర్బానీ ఒక్కో వికెట్ తీశారు. వీరి దెబ్బకు 48 ఓవర్లలోనే సర్వీసెస్ బ్యాటింగ్ కథ ముగిసింది.57 బంతుల్లోనే రుతు శతకంఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 20.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం ప్రదర్శించాడు. 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రుతు.. మొత్తంగా 74 బంతుల్లో 16 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 148 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఓం భోస్లే(24) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ 22 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మహారాష్ట్రను ఒంటి చేత్తో గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మెగా టోర్నీకి రెడీఇక ఈ టోర్నీలో మహారాష్ట్రకు ఇది రెండో విజయం. తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర రాజస్తాన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు రుతురాజ్ బ్యాట్ ఝులిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఫామ్ కొనసాగిస్తే మెగా టోర్నీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా తన భారీ సెంచరీతో సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడని పేర్కొంటున్నారు.చదవండి: నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. తిలక్ వర్మకు చేదు అనుభవం
విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ VHTలో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడింది.అయితే, ఈ లిస్ట్-‘ఏ’ మ్యాచ్‌లో ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.టాస్ గెలిచిన ముంబై.. తిలక్ వర్మ డకౌట్నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(64), అభిరథ్ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్ తిలక్ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.ఇక మిడిలార్డర్లో అలెగాని వరుణ్ గౌడ్(1), రోహిత్ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవినాశ్(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ 38.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ అథర్వ అంకోలేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళఅదే విధంగా తనుష్ కొటియాన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ(19), ఆయుశ్ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్ తామోర్(0), సూర్యాంశ్ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్(5), శార్దూల్ ఠాకూర్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.అయ్యర్ ధనాధన్.. తిలక్ సేనకు చేదు అనుభవంమరో ఎండ్ నుంచి తనుష్ కొటియాన్(37 బంతుల్లో 39 నాటౌట్) సహకారం అందించగా.. అయ్యర్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్‌రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్ సేనపై జయభేరి మోగించింది.ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్ -
ఫాస్టెస్ట్ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!
పంజాబ్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్- ‘ఎ’ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్ సందర్భంగా అన్మోల్ప్రీత్ సింగ్ ఈ ఫీట్ నమోదు చేశాడు.దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది.164 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ వర్మ 38, ప్రిన్స్ యాదవ్ 23, దేవాన్ష్ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్వని కుమార్ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, రఘు శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అభిషేక్ శర్మ విఫలంఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(25 బంతుల్లో 35 నాటౌట్)కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.45 బంతుల్లో 115 పరుగులుసుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్.కసిదీరా కొట్టేశాడుతద్వారా అరుణాచల్ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్ప్రీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్.. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్.. 139 పరుగులు సాధించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్A majestic counter-attacking 58-ball 💯 from Anmolpreet Singh 👏👏#SMAT | @IDFCFIRSTBank | #FinalFollow the match ▶️ https://t.co/1Kfqzc7qTr pic.twitter.com/3sdqD7CJvj— BCCI Domestic (@BCCIdomestic) November 6, 2023 -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. వన్డేలో విధ్వంసకర శతకం
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ) తొలి మ్యాచ్‌లోనే ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచికొట్టాడు. కర్ణాటక బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ విధ్వంసకర శతకం బాదాడు. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ముంబై భారీ స్కోరు సాధించింది.కాగా వీహెచ్‌టీ 2024-25 ఎడిషన్ రౌండ్ వన్‌లో భాగంగా గ్రూప్-‘సి’లో ఉన్న ముంబై కర్ణాటకతో తమ తొలి మ్యాచ్ ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బి గ్రౌండ్ ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆయుశ్, హార్దిక్ హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ(6) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే(78)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ హార్దిక్ తామోర్(84) ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ విశ్వరూపంఇక నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతుల్లోనే 114 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 207కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ధనాధన్ దంచికొట్టాడు. 36 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో దూబే 63 పరుగులు చేసి.. అయ్యర్‌తో కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.టీ20 తరహాలో వీరబాదుడుకాగా వన్డేలో టీ20 తరహాలో వీరబాదుడు బాదిన ఈ ఇద్దరి కారణంగా ముంబై నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ముంబై 382 పరుగులు సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు.మొత్తంగా పదహారు బంతులు ఎదుర్కొన్న ‘స్కై’ 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే రెండు, విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ తీశారు.ముంబై వర్సెస్ కర్ణాటక తుదిజట్లుకర్ణాటకమయాంక్ అగర్వాల్ (కెప్టెన్), అనీష్ కేవీ, నికిన్ జోస్, స్మరన్ రవిచంద్రన్, అభినవ్ మనోహర్, కృష్ణన్ శ్రీజిత్(వికెట్ కీపర్), శ్రేయస్ గోపాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, ప్రవీణ్ దూబే, వాసుకి కౌశిక్, విద్యాధర్ పాటిల్.ముంబైఅంగ్క్రిష్ రఘువంశీ, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్, శార్దూల్ ఠాకూర్, ఎం.జునేద్ ఖాన్, తనూష్ కొటియన్.చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
షమీకి విశ్రాంతి.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ క్రమంలో విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్లో తొలి మ్యాచ్‌కు ఈ బెంగాల్ బౌలర్ దూరం కానున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు.మోకాలు ఉబ్బిపోయింది!ఇటీవల జరిగిన దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ పదకొండు వికెట్ల తీశాడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా షమీ మరోసారి గాయపడినట్లు సమాచారం. అతడి మోకాలు ఉబ్బిపోయినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.అందుకే షమీని హడావుడిగా తిరిగి జట్టులోకి చేర్చుకునే పరిస్థితి లేదని.. ఆస్ట్రేలియా పర్యటనకు అతడు మొత్తంగా దూరమయ్యాడనే సంకేతాలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ప్రకటించిన బెంగాల్ జట్టులో షమీ పేరు కనిపించింది.విశ్రాంతినిచ్చాంఇక డిసెంబరు 21 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో బెంగాల్ తొలుత ఢిల్లీ జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు షమీ దూరంగా ఉండనున్నాడు. ‘‘విజయ్ హజారే ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు షమీ అందుబాటులో ఉండడు. ఈ టీమిండియా వెటరన్ బౌలర్‌కు విశ్రాంతినిచ్చాం’’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పేర్కొంది.చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధంఈ పరిణామాల నేపథ్యంలో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడు ఫిట్ లేని కారణంగా.. టీమిండియా మేనేజ్మెంట్ మరికొన్నాళ్లపాటు అతడిని పక్కన పెట్టనుందట.ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. అప్పుడే షమీ.. భారత జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా మూడు టెస్టులు ముగిసే సరికి 1-1తో సమంగా ఉంది. తదుపరి మెల్బోర్న్, సిడ్నీల్లో భారత్- ఆసీస్ మధ్య మిగిలిన రెండు టెస్టులు జరుగనున్నాయి.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. అతడిపై వేటు! సూర్యకు చోటు
దేశవాళీ వన్డే టోర్నమెంట్లో విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ టోర్నీ ఆడబోయే పదిహేడు మంది సభ్యుల పేర్ల(తొలి మూడు మ్యాచ్‌లు)ను మంగళవారం వెల్లడించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివం దూబే కూడా ఈ టోర్నీలో పాల్గొనునున్నట్లు తెలిపింది.అతడిపై వేటుఅయితే, ఓపెనర్ పృథ్వీ షాకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై సెలక్టర్లు వేటు వేశారు. మరోవైపు.. సూపర్ ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే వ్యక్తిగత కారణాల దృష్ట్యా సెలక్షన్‌కు అందుబాటులో లేడని తెలుస్తోంది.గత కొంతకాలంగా పృథ్వీ షా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్నెస్ లేమి తదితర కారణాలతో రంజీ జట్టుకు అతడు కొన్నాళ్లుపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చినా కేవలం 59 పరుగులే చేశాడు.మరోవైపు.. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరకే అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంఛైజీ పృథ్వీ షా వైపు కన్నెత్తి చూడలేదు. ఫలితంగా ఒకప్పటి ఈ స్టార్ బ్యాటర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఇక దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ పృథ్వీ షా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ టోర్నీలో 25 ఏళ్ల పృథ్వీ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి.. 197 పరుగులే చేయగలిగాడు. మధ్యప్రదేశ్‌తో ఫైనల్లోనూ పది పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.రహానే దూరంమరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైని విజేతగా నిలిపిన టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక పొట్టి ఫార్మాట్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించి ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన రహానే.. వన్డే టోర్నీలో మాత్రం ఆడటం లేదు. కాగా డిసెంబరు 21 నుంచి విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది.తిరుగులేని ముంబైకాగా భారత దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టు ఇప్పటికి 63 టైటిల్స్ గెలిచింది. రంజీ ట్రోఫీని 42 సార్లు నెగ్గిన ముంబై జట్టు ఇరానీ కప్‌ను 15 సార్లు దక్కించుకుంది. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో 4 సార్లు విజేతగా నిలిచిన ముంబై.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.విజయ్ హజారే వన్డే టోర్నీ 2024 -25కి తొలి మూడు మ్యాచ్‌లకు ముంబై జట్టుశ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, జే బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్ధేశ్ లాడ్, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, అధర్వ అంకోలేకర్, తనూష్ కొటియన్, శార్దూల్ ఠాకూర్, రాయ్స్టన్ డయాస్, జునేద్ ఖాన్, హర్ష్ తనా, వినాయక్ భోయిర్. చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా..
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన భార్య విజితతో కలిసి ఉన్న ఈ చిత్రం మైసూర్లోనిది. ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ఇక్కడ జరుగుతున్న బీసీసీఐ దేశవాళీ టోర్నీ (అండర్–19) కూచ్ బెహర్ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ద్రవిడ్ వచ్చాడు. మరో వైపు విజయవాడలో జరుగుతున్న అండర్–16 విజయ్‌మర్చంట్ ట్రోఫీలో ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ బరిలో ఉన్నాడు. ఉత్తరాఖండ్తోనే జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు.. కెప్టెన్, వికెట్‌కీపర్ అయిన అన్వయ్ 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే, అతడి కాంట్రాక్ట్‌ను పొడగిస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తదుపరి టీ20 ప్రపంచకప్-2024 వరకు ద్రవిడ్‌నే హెడ్‌కోచ్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం సెలవులో ఉన్న రాహుల్ ద్రవిడ్ తన కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో కుమారుడు సమిత్ మ్యాచ్ చూసేందుకు భార్యతో కలిసి మైదానానికి వెళ్లాడు. ఇక ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో ఆల్‌రౌండర్ సమిత్ తన ఐదు ఓవర్ల బౌలింగ్‌లో రెండు మెయిడెన్స్ వేసి 11 పరుగులు ఇచ్చాడు. మొదటిరోజు ఆట ముగిసే సరికి ఉత్తరాఖండ్ 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ద్రవిడ్ తిరిగి తన బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా భార్యతో కలిసి ద్రవిడ్ మైసూర్లో మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు ద్రవిడ్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. Rahul Dravid and his wife Vijeta watched the the Cooch Behar U-16 Trophy match between Karnataka and Uttarakhand. Their son Samit Dravid is a part of the squad.#CricketTwitter pic.twitter.com/zaQrqncsJ4 — Himanshu Pareek (@Sports_Himanshu) December 1, 2023 -
భీకర ఫామ్‌లో పడిక్కల్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభణ
విజయ్ హజారే ట్రోఫీ 2023లో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ దేశవాలీ వన్డే టోర్నీలో అతను మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. సెంచరీ, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 258 పరుగులు చేశాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 117) చేసిన అతను.. దానికి ముందు జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు హాఫ్ సెంచరీతో (35 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిశాడు. కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. విధ్వత్ కావేరప్ప (3/25), కౌశిక్ (3/19), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/27), కృష్ణప్ప గౌతమ్ (2/32) ధాటికి 36.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అయూశ్ బదోని (100) ఒక్కడే మూడొంతుల స్కోర్ చేయడం విశేషం. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన కర్ణాటక.. పడిక్కల్ (70) రాణించడంతో 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన మయాంక్ అగర్వాల్ (12) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మనీశ్ పాండే (28 నాటౌట్).. శరత్ (7 నాటౌట్) సహకారంతో కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, సుయాశ్ శర్మ, లలిత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్‌ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్‌దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్‌లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్‌తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్‌కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
బీసీసీఐ నుంచి బిగ్‌న్యూస్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి ఇవాళ (ఏప్రిల్ 11) ఓ బిగ్‌న్యూస్ వెలువడింది. 2023-24 భారత దేశవాలీ సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జూన్ 2023-మార్చి 2024 మధ్యలో సాగే ఈ సీజన్లో మొత్తం 1846 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2023 జూన్ 28న మొదలయ్యే దులీప్ ట్రోఫీతో ఈ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ జులై 16, 2023న ముగుస్తుంది. ఆ వెంటనే జులై 24-ఆగస్ట్ 3 మధ్యలో దియోధర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రెండు టోర్నీల్లో ఆరు జోన్ల జట్లు (సెంట్రల్, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్-ఈస్ట్) పాల్గొంటాయి. ఈ రెండు టోర్నీ తర్వాత అక్టోబర్ 1 నుంచి రంజీ ఛాంపియన్ సౌరాష్ట్ర-రెస్ట్ ఆఫ్ఇండియా జట్ల మధ్య ఇరానీ ట్రోఫీ మొదలవుతుంది. ఈ మూడు మల్టీ డే ఫార్మాట్ (టెస్ట్ ఫార్మాట్) టోర్నీల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20 ఫార్మాట్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే ఫార్మాట్) లు మొదలవుతాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుండగా.. విజయ్ హజారే ట్రోఫీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈ రెండు పరిమిత ఓవర్ల టోర్నీల్లో మొత్తం 38 జట్లు పోటీపడతాయి. అనంతరం 2024 జనవరి 5 నుంచి ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ మొదలుకానుంది. మార్చి 14 వరకు సాగే ఈ టోర్నీలోనూ మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే.. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీతో మహిళల డొమెస్టిక్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు సాగుతుంది. ఆతర్వాత నవంబర్ 24-డిసెంబర్ 4 మధ్యలో సీనియర్ వుమెన్స్ ఇంటర్ జోనల్ ట్రోఫీ జరుగుతుంది. దీని తర్వాత జనవరి 4, 2024 నుంచి సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ మొదలవుతుంది. ఈ టోర్నీ జనవరి 26 వరకు సాగుతుంది. -
నయా రన్ మెషీన్ రుతురాజ్.. ఆఖరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 8 శతకాలు
ప్రపంచ క్రికెట్లో సరికొత్త రన్ మెషీన్ ఆవిర్భవించాడు. లిస్ట్ ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ టోర్నీల్లో 50 ఓవర్ల మ్యాచ్‌లు) అతను పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. ఈ ఫార్మాట్లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. బరిలోకి దిగాడంటే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. ప్రత్యర్ధి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న ఆ ఆటగాడే రుతురాజ్ గైక్వాడ్. Ruturaj Gaikwad has 8 centuries from the last 10 innings in Vijay Hazare Trophy. - Unbelievable stuff from Gaikwad! — Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2022 విజయ్ హజారే ట్రోఫీ-2022లో మహారాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ పూణే చిన్నోడు.. లిస్ట్-ఏ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. ఇప్పటివరకు రన్ మెషీన్ అనే ట్యాగ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి మాత్రమే సూటయ్యేది. ఇప్పుడు ఆ ట్యాగ్‌కు నేను కూడా అర్హుడినే అంటూ రుతురాజ్ రేస్‌లోకి వచ్చాడు. తాజాగా ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో, అంతకుముందు సీజన్లో అతని గణాంకాలు చూసిన వారెవరైనా ఈ విషయంతో ఏకీభవించాల్సిందే. ఎందుకంటే పరిస్థితులపై అంతలా ప్రభావం చూపాడు ఈ చెన్నై సూపర్ కింగ్ (ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు). Ruturaj Gaikwad - Remember the name 🔥#RuturajGaikwad #VHT #Cricket #Maharashtra pic.twitter.com/oT1xEltFJv — Wisden India (@WisdenIndia) December 2, 2022 గత విజయ్ హజారే ట్రోఫీలో మొదలైన రుతురాజ్ శతకాల దండయాత్ర, పరుగుల సునామీ తాజా సీజన్లో సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో 108 పరుగులు సాధించిన రుతురాజ్.. అంతకుముందు సెమీస్‌లో 168 (126), క్వార్టర్ ఫైనల్లో 220 నాటౌట్ (159), ప్రీ క్వార్టర్ ఫైనల్లో 40 (42), గ్రూప్ మ్యాచ్‌లో రైల్వేస్‌పై 124 నాటౌట్ (123) పరుగులు సాధించాడు. ఈ సీజన్లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రుతురాజ్.. 3 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాదాడు. యూపీతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకాశమమే హద్దుగా చెలరేగిన రుతురాజ్.. ఓ ఓవర్లో ఏకంగా 7 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. Ruturaj Gaikwad's updated List A numbers: 71 innings, 4034 runs, AVE: 61.12, 100s: 15, 50s: 16 The only batter in the world to average over 60 in List A (min. 50 inn.)#VijayHazareTrophy — Lalith Kalidas (@lal__kal) December 2, 2022 ఇక విజయ్ హజారే ట్రోఫీ-2021 విషయానికి వస్తే.. గత సీజన్లో మహారాష్ట్ర ఆడిన ఆఖరి మ్యాచ్‌లో 168 (132) పరుగులు చేసిన రుతురాజ్, అంతకుముందు కేరళ (124), చత్తీస్గడ్ (154 నాటౌట్), మేఘాలయ (136)లపై హ్యాట్రిక్ సెంచరీలు బాదాడు. ఈ యువ డాషింగ్ ఆటగాడు తాజా సీజన్లోనూ నాకౌట్ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ సెంచరీలు బాది, డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. తన 71 ఇన్నింగ్స్‌ల చిన్నపాటి లిస్ట్-ఏ కెరీర్లో రుతురాజ్.. 61.12 సగటున 15 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 4034 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్లలో మరే ఆటగాడికి 60కి మించి సగటు లేదు. Ruturaj Gaikwad - Remember the name 🔥#RuturajGaikwad #VHT #Cricket #Maharashtra pic.twitter.com/oT1xEltFJv — Wisden India (@WisdenIndia) December 2, 2022 టీమిండియా తరఫున ఓ వన్డే, 9 టీ20లు ఆడిన 25 ఏళ్ల రుతురాజ్.. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ, దేశవాలీ టోర్నీల్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే ఇతను.. 36 మ్యాచ్‌ల్లో 130.3 స్ట్రయిక్ రేట్‌తో 1207 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ కూడా ఉంది. -
విజృంభించిన ఉనద్కత్.. ఫైనల్లో సౌరాష్ట్ర, మహారాష్ట్ర
Vijay Hazare Trophy 2022 Saurashtra VS Karnataka: విజయ్ హజారే ట్రోఫీ 2022లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సౌరాష్ట్ర.. జయదేవ్ ఉనద్కత్ (4/26), ప్రేరక్ మన్కడ్ (2/34) విజృంభించడంతో కర్ణాటకను 171 పరుగులకే (49.1 ఓవర్లు) కుప్పకూల్చింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో సమర్థ్ (88) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం 172 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. పరుగులేమీ చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత కోలుకుని 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. జే గోహిల్ (61) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (33), ప్రేరక్ మన్కడ్ (35), అర్పిత్ వసవద (25 నాటౌట్), చిరాగ్ జానీ (13 నాటౌట్) తలో చేయి వేసి జట్టును గెలిపించారు. ఇదే రోజు జరిగిన రెండో సెమీఫైనల్లో రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు), అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో మహారాష్ట్ర జట్టు 12 పరుగుల తేడాతో అస్సాంపై విజయం సాధించి, ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన అస్సాం లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రిషవ్ దాస్ (53), శివ్‌శంకర్ రాయ్ (78), స్వరూపం పుర్కాయస్తా (95) అర్ధశతకాలతో రాణించి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన మహారాష్ట్ర రేపు (డిసెంబర్ 2) జరుగబోయే ఫైనల్లో తొలి సెమీస్ విన్నర్ సౌరాష్ట్రతో తలపడనుంది. -
మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..!
Vijay Hazare Trophy 2022 Maharashtra VS Assam, 2nd Semi Final: విజయ్ హజారే ట్రోఫీ-2022లో భాగంగా అస్సాంతో ఇవాళ (నవంబర్ 30) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి చెలరేగిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు, అజేయమైన ద్విశతకంతో (220) పలు రికార్డులు బద్దలు కొట్టిన రుతురాజ్.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం బాది రోజుల వ్యవధిలోనే మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 126 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్.. 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 168 పరుగులు స్కోర్ చేశాడు. ఈ శతకంతో రుతురాజ్ ప్రస్తుత టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో 3 శతకాలు (552 పరుగులు) తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో (2021, 2022) రుతరాజ్ గత 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 7 శతకాలు (168, 220 నాటౌట్, 40, 124 నాటౌట్, 168, 21, 124, 154 నాటౌట్, 136) బాది లిస్ట్-ఏ క్రికెట్లో మరో రికార్డు నెలకొల్పాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌కు జతగా అంకిత్ బావ్నే (110) కూడా సెంచరీతో చెలరేగడంతో మహారాష్ట్ర టీమ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది.