దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(Prabhsimran Singh)- అభిషేక్ శర్మ(Abhishek Sharma) దుమ్ములేపుతున్నారు. అద్బుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో ఈ ఓపెనింగ్ జోడీ అరుదైన రికార్డు సాధించింది.
సౌరాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా తొలి వికెట్‌కు 298 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అభిషేక్- ప్రభ్‌సిమ్రన్.. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare trophy)లో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన రెండో జంటగా నిలిచారు. ఇక తాజాగా హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ ఈ జోడీ ధనాధన్ దంచికొట్టింది.
మళ్లీ శతక్కొట్టాడు!
అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు శతకం బాదగా.. కెప్టెన్ అభిషేక్ శర్మ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
కాగా ప్రభ్‌సిమ్రన్ 105 బంతుల్లో ఏకంగా 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. అభిషేక్ 72 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 93 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 145 బంతుల్లో 196 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
426 పరుగుల భారీ స్కోరు
మిగిలిన బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్ సింగ్(46), రమణ్‌దీప్ సింగ్(80), నేహాల్ వధేరా(35 నాటౌట్), నమన్ ధీర్(14 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అత్యధిక పరుగుల వీరుడిగా
హైదరాబాద్ బౌలర్లలో ముదస్సిర్, శరణు నిశాంత్, అనికేత్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.
ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి సగటున 473 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 150 నాటౌట్. మరోవైపు.. పంజాబ్ సారథి అభిషేక్ శర్మ ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీల సాయంతో 397 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 170.
ఏకంగా 644 పరుగులు
ఇక ఈ ప్రదర్శనలతో.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ భారత సెలక్టర్లకు గట్టి సందేశం పంపించినట్లయింది. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌తో టీ20లలో ఆడటం ఖాయంగానే అనిపిస్తున్నా.. ఈసారైనా ప్రభ్‌సిమ్రన్‌ను సెలక్టర్లు కనికరిస్తారేమో చూడాలి!
కాగా విజయ్ హజారే ట్రోఫీలో గత మూడు మ్యాచ్‌లలో కలిపి ప్రభ్‌సిమ్రన్ సింగ్- అభిషేక్ శర్మ జోడీ ఏకంగా 644 పరుగులు(150, 298, 196) సాధించడం విశేషం. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.
చదవండి: కొన్‌స్టాస్ ఓవరాక్షన్.. బుమ్రా ఆన్ ఫైర్!.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది!
Comments
Please login to add a commentAdd a comment