విజయ్ హజారే ట్రోఫీ 2023లో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ దేశవాలీ వన్డే టోర్నీలో అతను మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. సెంచరీ, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 258 పరుగులు చేశాడు.
తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 117) చేసిన అతను.. దానికి ముందు జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు హాఫ్ సెంచరీతో (35 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిశాడు.
కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. విధ్వత్ కావేరప్ప (3/25), కౌశిక్ (3/19), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/27), కృష్ణప్ప గౌతమ్ (2/32) ధాటికి 36.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అయూశ్ బదోని (100) ఒక్కడే మూడొంతుల స్కోర్ చేయడం విశేషం.
అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన కర్ణాటక.. పడిక్కల్ (70) రాణించడంతో 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన మయాంక్ అగర్వాల్ (12) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మనీశ్ పాండే (28 నాటౌట్).. శరత్ (7 నాటౌట్) సహకారంతో కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, సుయాశ్ శర్మ, లలిత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment