N Jagadeesan
-
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడిన కేకేఆర్ ప్లేయర్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో మరో ట్రిపుల్ సెంచరీ నమోదైంది. తొలుత అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడగా.. తాజాగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్, కేకేఆర్ ఆటగాడు ఎన్ జగదీశన్ త్రిశతకంతో (321) కదం తొక్కాడు. జగదీశన్‌కు తోడు ప్రదోశ్ పాల్ (105), బాబా ఇంద్రజిత్ (123) శతకాలతో రాణించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు బౌలింగ్‌లోనూ తమిళనాడు బౌలర్లు రెచ్చిపోయారు. సాయికిషోర్ (3/31), వారియర్ (3/28), అజిత్ రామ్ (2/6), కుల్దీప్ సేన్ (1/34) ధాటికి చండీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలింది. చండీఘడ్ ఇన్నింగ్స్‌లో కునాల్ మహాజన్ (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ పేలవ ప్రదర్శనతో ఓటమిని ఖరారు చేసుకున్న చండీఘడ్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ చెత్తగా ఆడుతుంది. మూడో రోజు తొలి సెషన్ సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఆ జట్టు తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 462 పరుగులు వెనుకంజలో ఉంది. సాయికిషోర్ (2/15) చండీఘడ్ను మరోసారి దెబ్బకొట్టాడు. మయాంక్ సిద్దూ (4), కునాల్ మహాజన్ (3) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, జగదీశన్ ఐపీఎల్లో గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. 2024 సీజన్ వేలంలో జగదీశన్‌ను కేకేఆర్ సొంతం చేసుకుంది. -
వరుసగా 5 సెంచరీలు బాదిన జగదీశన్ ఖాతాలో మరో మెరుపు సెంచరీ
Ranji Trohy 2022-23: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో వరుసగా 5 సెంచరీలు (114 నాటౌట్, 107, 168, 128, 277) బాది పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన తమిళనాడు విధ్వంసకర బ్యాటర్ ఎన్ జగదీశన్.. తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీఎస్కే మాజీ ప్లేయర్ మరోసారి జూలు విదిల్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు (141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన జగదీశన్.. ఇవాళ హైదరాబాద్‌పై 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్‌కు ఇది ఐదో సెంచరీ. జగదీశన్ పార్ట్నర్, తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్ (179), అపరాజిత్ (115) కూడా సెంచరీలతో కదం తొక్కడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 87 పరుగులు వెనకంజతో ఉంది. అంతకుముందు తన్మయ్ అగర్వాల్ (135), మికిల్ జైస్వాల్ (137 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం చదవండి: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు -
ఒకే రోజు 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు.. పరుగుల ప్రవాహం
VHT 2022: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా నవంబర్ 21 జరిగిన మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారింది. ఈ ఒక్క రోజే ఏకంగా 15 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీ హవాలో పై పేర్కొన్న గణాంకాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కేరళ ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ (107 నాటౌట్), మధ్యప్రదేశ్ ఓపెనర్ యశ్ దూబే (195 నాటౌట్), హిమాచల్ ప్రదేశ్ ఏకాంత్ సేన్ (116), చండీఘడ్ అర్స్‌లన్ ఖాన్ (107), ఒడిశా ఆటగాడు కార్తీక్ బిశ్వాల్ (107 నాటౌట్), గుజరాత్ ఆటగాడు కథన్ పటేల్ (109), హైదరాబాద్ ఆటగాడు రోహిత్ రాయుడు (109), తమిళనాడు ఆటగాళ్లు నారాయణ్ జగదీశన్ (277), సాయ్ సుదర్శన్ (154), ఆంధ్రప్రదేశ్ రికీ భుయ్ (112 నాటౌట్), జార్ఖండ్ ఆటగాడు విక్రమ్ సింగ్ (116 నాటౌట్), బెంగాల్ ఆటగాళ్లు సుదీప్ ఘరామీ (162), అభిమన్యు ఈశ్వరన్ (122), రాజస్తాన్ ఆటగాడు ఆదిత్య గర్హ్వాల్ (149 నాటౌట్), మహారాష్ట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (107) సెంచరీలు బాదగా.. మరో 36 మంది హాఫ్ సెంచరీలు సాధించారు. -
5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం
నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను గత సీజన్ నుంచి దురదృష్టం వెంటాడుంది. 2022 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు.. నాటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతీది బెడిసి కొడుతూనే ఉంది. కెప్టెన్ మార్పు దగ్గరి నుంచి ఆ జట్టు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయి. దీనికి తోడు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం, ఫామ్‌లో ఉండిన డెవాన్ కాన్వే లాంటి ఆటగాడు వ్యక్తిగత కారణాల చేత పలు కీలక మ్యాచ్‌లకు దూరం కావడం, ఫలితంగా సీజన్‌ను చివరి నుంచి రెండో స్థానంతో ముగించడం.. ఇలా గత సీజన్లో ఆ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. తాజాగా ఆ ఫ్రాంచైజీ తీసుకున్న మరో నిర్ణయం, జట్టు కెప్టెన్ ధోని సహా యాజమాన్యాన్ని తీవ్ర పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. ఓ ఆటగాడిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యామన్న ఓ విషయం ధోని అండ్ కో ను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో సీఎస్కే జట్టు మొత్తం 8 మంది ఆటగాళ్లను వదులుకుంది. అందులో ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగిపోతున్న నారాయణ్ జగదీశన్ పేరు ఉండటమే సీఎస్కే మనోవేదనకు, పశ్చాత్తాపానికి ప్రధాన కారణం. ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న భారత దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో జగదీశన్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 5 శతకాలు బాది పూనకం వచ్చిన ఆటగాడిలా ఊగిపోతున్నాడు. ఇవాళ (నవంబర్ 21) అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 141 బంతులను ఎదుర్కొన్న జగదీశన్.. 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో రికార్డు స్థాయిలో 277 పరుగులు చేశాడు. జగదీశన్ పరుగుల ప్రవాహంలో పలు ప్రపంచ రికార్డులు కొట్టుకుపోయాయి. ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో వరుసగా 5 శతకాలు బాది (114 నాటౌట్, 107, 168, 128, 277) చరిత్ర సృష్టించాడు. ఈ చిచ్చరపిడుగు జగదీశన్నే సీఎస్కే జట్టు కొద్ది రోజుల ముందు.. ఈ ఆటగాడు మాకొద్దు బాబోయ్ అని వదులుకుంది. బహుశా ఈ అవమానమే అతనిలో కసి రగిల్చి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసి ఉండవచ్చు. సీఎస్కే జట్టు 2022 సీజన్‌కు ముందు జగదీశన్‌ను బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. స్థానిక ఆటగాడు (తమిళనాడు) కావడం, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తుండటంతో చెన్నై ఫ్రాంచైజీ అతన్ని ఈ సీజన్‌ను ముందు జరిగిన మెగా వేలంలో సొంతం చేసుకుంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన జగదీశన్.. 2018లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ (సీఎస్కే) ఇచ్చినప్పటికీ.. అతను అరంగేట్రం చేసింది మాత్రం 2020 సీజన్లో. జగదీశన్ తన ఐపీఎల్ కెరీర్లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 110.61 స్ట్రయిక్ రేట్‌తో 73 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 39 నాటౌట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, జగదీశన్ తన తాజా ఫామ్‌తో మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతని గణాంకాలు చూసి సీఎస్కే సహా అన్ని జట్టు అతని కోసం క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్లో కేవలం 20 లక్షలకు అమ్ముడుపోయిన అతను వచ్చే నెలలో జరిగే మినీవేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. -
38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు
విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా తమిళనాడు-అరుణాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన గ్రూప్-సి మ్యాచ్ కనీవినీ ఎరుగని రికార్డులకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) డబుల్ సెంచరీతో శివాలెత్తడంతో తమిళనాడు 435 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లిస్ట్-ఏ (అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాలీ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యంత భారీ విజయంగా రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు.. ఓపెనర్లు జగదీశన్, సాయ్ సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకాలతో వీరవిహారం చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగుల భారీ స్కోర్ చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. అనంతరం ఆసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్.. 28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే ఆలౌటై, లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మణిమారన్ సిద్ధార్థ్ (5/12) అరుణాచల్‌ప్రదేశ్ పతనాన్ని శాశించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జగదీశన్ వ్యక్తిగతంతా పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇదే టోర్నీలో 4 వరుస శతకాలు బాదిన (114 నాటౌట్, 107, 168, 128) జగదీశన్.. తాజాగా డబుల్ సెంచరీతో వరుసగా ఐదో శతకాన్ని నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఇలా వరుసగా ఐదు సెంచరీలు చేయడం ప్రపంచ రికార్డు. గతంలో శ్రీలంక దిగ్గజం సంగక్కర, సౌతాఫ్రికా ఆటగాడు అల్విరో పీటర్సన్, భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా 4 శతాకలు బాదారు. ఈ మ్యాచ్‌లో డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డునే బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ (శ్రీలంకపై 264 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతుండగా.. జగదీశన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ విభాగంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇంగ్లీష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268) పేరిట ఉండేది. డబుల్ సాధించే క్రమంలో జగదీశన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి శతకాన్ని సాధించేందుకు 76 బంతులు తీసుకున్న అతను.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని ఇన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం కూడా లిస్ట్-ఏ క్రికెట్లో రికార్డే. మొత్తానికి నారాయణ్ జగదీశన్ ధాటికి లిస్ట్-ఏ రికార్డులు చాలావరకు బద్ధలయ్యాయి. అతను సృష్టించిన విధ్వంసం ధాటికి పలు ప్రపంచ రికార్డులు సైతం తునాతునకలయ్యాయి. అతని సిక్సర్ల సునామీలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కొట్టుకుపోయింది. -
TNPL 2022: క్రికెటర్ అసభ్యకర సంజ్ఞ.. ఛీ.. నీకసలు బుద్ధుందా? ఇంత దిగజారుతావా?
Tamilnadu Premier League-2022: తమిళనాడు ప్రీమియర్ లీగ్-2022 గురువారం(జూన్ 23) తిరునల్వేలి వేదికగా ఆరంభమైంది. ఇందులో భాగంగా చెపాక్ సూపర్ గిల్లీస్, నెలాయి రాయల్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇండియన్ సిమెంట్ కంపెనీ గ్రౌండ్లో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెపాక్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తీవ్ర ఉత్కంఠ.. టై ఈ క్రమంలో రాయల్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెపాక్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 184 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా రాయల్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ జట్టు బ్యాటర్ సంజయ్ యాదవ్ 47 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా చెపాక్ సూపర్ గిల్లీస్ ఓపెనర్ ఎన్. జగదీశన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అతడిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రూల్స్ నచ్చకపోతే క్రికెట్ ఆడటం మానేసెయ్.. అంతేగానీ మరీ ఇంత దిగజారి ప్రవర్తించకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. బుద్ధి ఉందా అసలు? కాగా ప్రత్యర్థి జట్టు ఆటగాడి పట్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. చెపాక్ ఇన్నింగ్స్ సమయంలో 3.4వ ఓవర్లో బాబా అపరాజిత్ బౌలింగ్‌కు రాగా.. కౌశిక్ గాంధీ క్రీజులో ఉన్నాడు. అయితే, అపరాజిత్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జగదీశన్ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్ జగదీశన్ మన్కడింగ్ చేయడంతో రనౌట్‌గా అతడు వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్ అసభ్యకర సంజ్ఞ చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌లోనే ఇలా వివాదానికి కారణమయ్యాడని, ఆటగాళ్ల పట్ల నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది.. ముందు నిబంధనలు తెలుసుకుని ఆడు అంటూ నెటిజన్లు జగదీశన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ది ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అది రనౌటే! క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కాదు. ఈ మేరకు ఎంసీసీ చేసిన పలు సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమల్లోకి రానున్నాయి. చదవండి: Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్మెంట్ గనుక ఉండి ఉంటే! TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! A royal comeback from the @NRKTNPL ! Watch Shriram Capital TNPL on @StarSportsTamil & @StarSportsIndia Also, streaming live for free, only on @justvoot ! Download the app now! #NammaOoruNammaGethu#TNPL2022#VootonTNPL#TNPLonVoot#TNPLonStarSportsTamil#CSGvsNRK pic.twitter.com/onCAfd4z58 — TNPL (@TNPremierLeague) June 23, 2022 🤐🤐🤐🤐 @Jagadeesan_200 @aparajithbaba senior players of tn🤐🤐🤐 pic.twitter.com/C9orMqRPL3 — Jayaselvaa ᅠ (@jayaselvaa1) June 23, 2022