దులీప్ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇండియా-డి ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇండియా-బితో ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఆరేసిన అర్షదీప్
373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-బి.. అర్షదీప్ సింగ్ (6/40), ఆదిథ్య థాకరే (4/59) ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. ఇండియా-బి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (40 నాటౌట్), అభిమన్యు ఈశ్వరన్ (19), సూర్యకుమార్ యాదవ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
రికీ భుయ్ అజేయ శతకం
రికీ భుయ్ అజేయ సెంచరీతో (119) కదం తొక్కడంతో ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (50), సంజూ శాంసన్ (45) రాణించారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, నవ్‌దీప్ సైనీ 3, మోహిత్ అవస్థి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీ.. ఆదుకున్న సుందర్
అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో (116), వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87) రాణించడంతో ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేయగలిగింది. ఇండియా-డి బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్షదీప్ 3, ఆదిథ్య ఠాకరే 2 వికెట్లు తీశారు.
సంజూ మెరుపు సెంచరీ.. పడిక్కల్, భరత్, భుయ్ అర్ద సెంచరీలు
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీతో (106) చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52), రికీ భుయ్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. ఇండియా-బి బౌలర్లలో నవదీప్ సైనీ 5, రాహుల్ చాహర్ 3, ముకేశ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: బంగ్లాతో రెండు టెస్టు.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment