సాక్షి, విజయనగరం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రికీ భుయ్ (248 బంతుల్లో 129; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోన శ్రీకర్ భరత్ (277 బంతుల్లో 178 నాటౌట్; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో... హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 231 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది.
ఓవర్‌నైట్ స్కోరు 207/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఏడు వికెట్లకు 502 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఆ జట్టు 198 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం తన్మయ్ (13 బ్యాటింగ్), తిలక్ వర్మ (20 బ్యా టింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు.
ఆంధ్ర భారీ స్కోరు
Published Wed, Jan 2 2019 1:39 AM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment