దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-డి ఆటగాడు రికీ భుయ్ అద్బుతమైన సెంచరీ (195 బంతుల్లో 113; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. ఈ మ్యాచ్‌లో భుయ్ సెంచరీతో మెరిసినా ఇండియా-డికి ఓటమి తప్పలేదు. 488 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి 301 పరుగులకే ఆలౌటై, 186 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భుయ్‌కి జట్టులో ఏ ఒక్క ఆటగాడి నుంచి సహకారం లభించలేదు. సంజూ శాంసన్ (40), శ్రేయస్ అయ్యర్ (41), యశ్ దూబేలకు (37) మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
Ricky Bhui smashed a 4th innings century while chasing 488 in the Duleep Trophy.
- Salute, Bhui...!!! 🙇♂️🫡pic.twitter.com/tLnPMvO15w— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు షమ్స్ ములానీ (89), తునశ్ కోటియన్ (53) అర్ద సెంచరీలు చేసి ఇండియా-ఏకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. ఇండియా-డి బౌలర్లలో హర్షిత రాణా 4, విధ్వత్ కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. ఖలీల్ అహ్మద్ (3/39), ఆకిబ్ ఖాన్ (3/41) ఇండియా-డి పతనాన్ని శాశించారు. ఇండియా-డి ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
107 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. మయాంక్ అగర్వాల్ (56), షాశ్వత్ రావత్ (64 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
THE WINNING MOMENT FOR INDIA A.
- Riyan Parag takes the final wicket, A thumping 186 runs win. 💯 pic.twitter.com/8JnlzIDtja— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2024
భారీ లక్ష్య ఛేదనలో ఇండియా-డి పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లక్ష్యం పెద్దది కావడంతో ఇండియా-డికి ఓటమి తప్పలేదు. రికీ భుయ్ వీరోచిత సెంచరీ కూడా ఇండియా-డిని కాపాడలేకపోయింది. ఇండియా-ఏ బౌలర్లలో తనుశ్ కోటియన్ 4, షమ్స్ ములానీ 3 వికెట్లు తీసి ఇండియా-డిని దెబ్బకొట్టారు.
చదవండి: ఈశ్వరన్ సూపర్ సెంచరీ.. 332 పరుగులకు ఇండియా-సి ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment