భారత్ ‘డి’ రెండో ఇన్నింగ్స్ 244/5
భారత్ ‘బి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్
సాక్షి, అనంతపురం: ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (87 బంతుల్లో 90 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా భారత్ ‘బి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘డి’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 50; 7 ఫోర్లు, ఒక సిక్సర్), సంజూ సామ్సన్ (53 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (3), శ్రీకర్ భరత్ (2) విఫలమయ్యారు. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో భుయ్, శ్రేయస్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ వన్డే తరహాలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారత్ ‘బి’ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్‌దీప్ సైనీ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 210/6తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘బి’ చివరకు 76.2 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (140 బంతుల్లో 87; 7 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకున్నాడు. చివరి వరస ఆటగాళ్లతో కలిసి జట్టుకు విలువైన స్కోరు అందించాడు. భారత్ ‘డి’ బౌలర్లలో సౌరభ్ కుమార్ 5, అర్‡్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న భారత్ ‘డి’ ఓవరాల్‌గా 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. రికీ భుయ్‌తో పాటు ఆకాశ్ సేన్ గుప్తా (28 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: 349;
భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్: 282
భారత్ ‘డి’ రెండో ఇన్నింగ్స్: దేవదత్ పడిక్కల్ (సి) జగదీశన్ (బి) నవ్‌దీప్ సైనీ 3; శ్రీకర్ భరత్ (బి) ముకేశ్ కుమార్ 2; రికీ భుయ్ (నాటౌట్) 90; నిశాంత్ సింధు (సి అండ్ బి) నవ్‌దీప్ సైనీ 5; శ్రేయస్ అయ్యర్ (సి) మోహిత్ అవస్థి (బి) ముకేశ్ కుమార్ 50; సంజూ సామ్సన్ (సి) ప్రభుదేశాయ్ (బి) ముకేశ్ కుమార్ 45; ఆకాశ్ సేన్ గుప్తా (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం (44 ఓవర్లలో 5 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–9, 2–13, 3–18, 4–93, 5–161, బౌలింగ్: ముకేశ్ కుమార్ 13–0–80–3; నవ్‌దీప్ సైనీ 11–2–40–2; మోహిత్ అవస్థి 9–2–41–0; నితీశ్ కుమార్ రెడ్డి 3–0–19–0; రాహుల్ చాహర్ 5–0–27–0; ముషీర్ ఖాన్ 3–0–18–0.
Comments
Please login to add a commentAdd a comment