ఆసియా కప్-2022లో పాల్గొనబోయే భారత జట్టును టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనావేశాడు. కాగా గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ తిరిగి ఆసియా కప్‌తో రిఎంట్రీ ఇస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ భారత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం ఉందని చోప్రా తెలిపాడు.
బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌ను అతడు ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా,దీపక్ హుడాకు అవకాశం ఇచ్చాడు.
ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే.. అశ్విన్, యజువేంద్ర చాహల్‌ను చోప్రా స్థానం కల్పించాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌కు సింగ్, భువనేశ్వర్‌కు చోటుచ్చాడు. కాగా ఆసియా కప్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి జరగనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. కాగా ఆసియా కప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.
ఆసియా కప్‌కు ఆకాశ్ చోప్రా అంచనా వేసిన భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్,భువనేశ్వర్ కుమార్ , మహ్మద్ షమీ
𝐂𝐫𝐢𝐜𝐤𝐞𝐭'𝐬 𝐠𝐫𝐞𝐚𝐭𝐞𝐬𝐭 𝐫𝐢𝐯𝐚𝐥𝐫𝐲 returns to deliver a blockbuster with @ImRo45's #TeamIndia! 🤩#BelieveInBlue | #AsiaCup2022 | #INDvPAK | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/Jf01OLLwYz
— Star Sports (@StarSportsIndia) August 8, 2022
చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో
Comments
Please login to add a commentAdd a comment