హనుమ విహారి (ఫైల్ ఫొటో)
Ranji Trophy 2023-24- Chhattisgarh vs Andhra: రంజీ ట్రోఫీ 2023-24లో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఛత్తీస్‌గఢ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 431 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్‌లో హనుమ విహారి(183), కెప్టెన్ రికీ భుయ్(120) సెంచరీలు చేయడంతో ఈ మేరకు పరుగులు సాధించింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ 262 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. ఆంధ్రకు 169 రన్స్ ఆధిక్యం దక్కింది.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆంధ్ర జట్టు.. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 150 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు 320 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, ఆంధ్ర బౌలర్ల విజృంభణ కారణంగా ఛత్తీస్‌గఢ్ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
కాగా సోమవారం ముగిసిన ఈ రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లలో ప్రశాంత్ కుమార్, నితీశ్ రెడ్డి మూడేసి వికెట్లు తీయగా.. పృథ్వీరాజ్ యర్రా రెండు, గిరినాథ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: Ind vs Eng: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment