హనుమ విహారి (ఫైల్ ఫొటో)
Ranji Trophy 2023-24 - Chhattisgarh vs Andhra రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది.
41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హనుమ విహారి (119 బ్యాటింగ్; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రికీ భుయ్ (120; 14 ఫోర్లు) సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 231 పరుగులు జోడించారు. విహారి, కరణ్ షిండే (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇక ఇరుజట్ల మధ్య శనివారం రెండో రోజు ఆట మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment