సౌరాష్ట్రతో రంజీ పోరు.. అర్ధ సెంచరీతో రాణించిన రికీ భుయ్‌ | Ricky Bhui Hits Half Century Against Saurashtra Ranji Trophy | Sakshi
Sakshi News home page

Ranji Trophy: సౌరాష్ట్రతో రంజీ పోరు.. అర్ధ సెంచరీతో రాణించిన రికీ భుయ్‌

Published Wed, Jan 18 2023 10:20 AM | Last Updated on Wed, Jan 18 2023 10:21 AM

Ricky Bhui Hits Half Century Against Saurashtra Ranji Trophy - Sakshi

రాజ్‌కోట్‌: ఆంధ్ర బ్యాటర్‌ రికీ భుయ్‌ (155 బంతు ల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ లో సౌరాష్ట్రతో జరుగుతు న్న మ్యాచ్‌లో తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆంధ్ర జట్టు 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌ (34; 6 ఫోర్లు), అభిషేక్‌ రెడ్డి (46; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమే ఇచ్చారు.

అయితే సౌరాష్ట్ర స్పిన్నర్‌ ధర్మేంద్రసింగ్‌ జడేజా (3/80) తన వరుస ఓవర్లలో అభిషేక్, జ్ఞానేశ్వర్‌లను పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం కెప్టెన్‌ హనుమ విహారి (38; 7 ఫోర్లు), రికీ భుయ్‌ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో  విహారిని కూడా జడేజా బౌల్డ్‌ చేశాడు. తర్వాత కరణ్‌ షిండే (31; 5 ఫోర్లు) అండతో రికీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసే దశలో చేతన్‌ సకారియా బౌలింగ్‌లో రికీ భుయ్‌ వెనుదిరిగాడు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్‌కు చోటు! చాహల్‌కు నో చాన్స్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement