విజయ్ మర్చంట్ ట్రోఫీలో హైదరాబాద్, కర్ణాటక మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగి కర్ణాటకను రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
జింఖానా, న్యూస్‌లైన్: విజయ్ మర్చంట్ ట్రోఫీలో హైదరాబాద్, కర్ణాటక మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగి కర్ణాటకను రెండు ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో ఫాలోఆన్‌లో పడిన కర్ణాటక బుధవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
ఆదిత్య రెడ్డి (39) రాణించాడు. అంతకుముందు 90/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 94.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్‌కు 162 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయ్యప్ప (35), బద్రీ (61) ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్ బౌలర్లలో చందన్ సహాని 4, వర్మ, సోహైల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హైదరాబాద్‌కు 3, కర్ణాటకకు 1 పాయింట్ లభించింది.