జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. మనదేశంతో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం(సెప్టెంబర్11) తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో భారత జవాను ఒకరు గాయపడ్డట్లు సమాచారం. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్ కాల్పులతో అప్రమత్తమైనట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘించడం గమనార్హం. సెప్టెంబర్ 18న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరగనుంది.
కాగా, 2021లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించిన తర్వాత సరిహద్దు వెంబడి భారత్,పాకిస్తాన్ మధ్య కాల్పులు పెద్దగా లేవు. గతేడాది మాత్రం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడొకరు మృతి చెందారు.
ఇదీ చదవండి.. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్
Comments
Please login to add a commentAdd a comment