
ఎల్‌ఓసీ వద్ద కాపలా కాస్తున్న జవాను( పాత చిత్రం)
జమ్మూ కశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. శాంతి శాంతి అంటూనే సరిహద్దు రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి గురువారం పాక్ కాల్పులకు దిగడంతో ఓ మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పూంచ్ జిల్లాలోని మెంధర్ ప్రాంతంలోని పౌరుల ఇళ్లపై కాల్పులు జరిపింది.
విషయం తెలిసి అక్కడే ఉన్న భద్రతాబలగాలు కూడా ధీటుగా పాక్‌కు సమాధానమిచ్చారు. పాక్ కాల్పుల్లో మరో మహిళకు కూడా గాయాలు అయ్యాయి. ఆమెను దగ్గరలోని మిలటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment