
కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటి దేశం లోపలికి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఆదివారం అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం అప్రమత్తమైంది.
ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి అటవీ ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది. రంజాన్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలను కేంద్రం నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదుల కదలికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment