Indian Security
-
డ్రోన్ ముప్పును తప్పించే సాంకేతికత
న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 6 లక్షలకు పైగా అనియంత్రిత డ్రోన్లు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద చర్యలు, ఇతర సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా స్కై ఫెన్స్, డ్రోన్ గన్ తదితర ఆధునిక యాంటీ డ్రోన్ ఆయుధాల వినియోగాన్ని పలు భద్రతా సంస్థలు పరీక్షిస్తున్నాయని ఆదివారం వెల్లడించాయి. డ్రోన్లు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్, రిమోట్ ద్వారా పనిచేసే చిన్న విమానాలు భద్రత పరంగా సున్నితమైన ప్రాంతాలకు, ఇతర కీలక కార్యాలయాలకు, ప్రజలు భారీగా పాల్గొనే కార్యక్రమాలకు ముప్పుగా పరిణమించే అవకాశంపై సెక్యూరిటీ సంస్థలు ఒక బ్లూప్రింట్‌ను రూపొందించాయి. పీటీఐ వార్తాసంస్థ చేతికి చిక్కిన ఆ నివేదికలో.. ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయా సంస్థలు నిర్ధారించాయి. వివిధ సైజులు, వివిధ సామర్థ్యాలున్న ఈ 6 లక్షల డ్రోన్లను ఎవరైనా విధ్వంసానికి వాడే అవకాశముందని హెచ్చరించాయి. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇటీవల జరిగిన డ్రోను దాడులు, పాకిస్తాన్ సరిహద్దుల్లో నుంచి పంజాబ్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత.. తదితరాలను అందులో ప్రస్తావించాయి. అందువల్ల ఈ ముప్పును ఎదుర్కొనేందుకు, ఆయా డ్రోన్లను ఎదుర్కొని నిర్వీర్యం చేసేందుకు స్కై ఫెన్స్, డ్రోన్ గన్, ఎథీనా, డ్రోన్ క్యాచర్, స్కైవాల్... తదితర సాంకేతికతను ఉపయోగించుకోవడాన్ని భారత సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇండియన్ పోలీస్ జర్నల్‌లో రాజస్తాన్ అదనపు డీజీపీ పంకజ్ కుమార్ రాసిన ‘డ్రోన్స్.. అ న్యూ ఫ్రంటియర్ ఫర్ పోలీస్’ అనే వ్యాసంలో ఈ వివరాలున్నాయి. డ్రోన్ గన్ ద్వారా డ్రోన్‌కు దాని పైలట్ నుంచి అందే మొబైల్ సిగ్నల్‌ను అడ్డుకుని, అది ఎలాంటి విధ్వంసం సృష్టించకముందే దాన్ని నేలకూల్చే అవకాశముంది. అలాగే, కీలక స్థావరాలపై డ్రోన్లకు అందే సిగ్నల్స్‌ను అడ్డుకునేలా డ్రోన్ ఫెన్స్‌లు ఏర్పాటు చేయవచ్చు. హరియాణాలోని బోండ్సిలో ఉన్న బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఇటీవల తొలిసారి ఈ డ్రోన్ వ్యతిరేక సాంకేతికతలను ప్రదర్శించారు. ఈసీఐఎల్, బీఈఎంఎల్ సంస్థలు తమ తయారీ యాంటీ డ్రోన్ సాంకేతికతలను ప్రదర్శించాయి. ఎయిర్‌ఫోర్స్, సీఐఎస్ఎఫ్ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. -
భారత ఆర్మీపై గౌరవాన్ని చాటుకున్న ధోని
-
ధోని చేసిన పనికి సెల్యూట్..!
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి భారత ఆర్మీ అంటే ఎనలేని గౌరవం. క్రికెట్ అభిమానుల మాదిరిగానే ఇండియన్ ఆర్మీకీ అతనంటే ప్రత్యేకమైన అభిమానం. 2011లో ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చి ఇండియన్ ఆర్మీ గౌరవించిన సంగతి తెలిసిందే. భారత పారామిలటరీ దళంలో పనిచేయడమంటే తనకెంతో ఇష్టమని ధోని పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019ని ఘనంగా ఆరంభించిన కోహ్లిసేన దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. 227 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మిస్టర్‌కూల్ ఎంస్ ధోని ఇండియన్ పారామిలటరీ రెజిమెంట్‌తో తయారు చేసిన గ్లోవ్స్ ధరించి కీపింగ్ చేయడం విశేషం. (సూపరోహిట్...) ధోని గ్లోవ్స్‌పై ఉన్న ‘బలిదాన్’(త్యాగం) చిహ్నం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫెలుక్వాయోను (34) స్టంపౌట్ చేసిన సమయంలో బయటపడింది. అమర జవాన్లకు నివాళిగా ధోని చేసిన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అందుకే మీరంటే మాకు అత్యంత అభిమానం, గౌరవం.. మీకిదే మా సెల్యూట్’ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 34 పరుగులు సాధించిన ధోని టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అతని సారథ్యంలో టీమిండియా 2011 క్రికెట్ వరల్డ్‌కప్ గెలుచుకున్న సంగతి విదితమే. ఈ ఏడాది ప్రారంభంలో.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధరించి పుల్వామా అమరులకు నివాళర్పించారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ జూన్ 9న ఆస్ట్రేలియాతో జరగనుంది. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దులు దాటి దేశం లోపలికి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఆదివారం అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన అనంతరం అక్కడి అటవీ ప్రాంతంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది. రంజాన్ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో సైనిక కార్యకలాపాలను కేంద్రం నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదుల కదలికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేరన్‌లో అప్రమత్తంగా భద్రతా సిబ్బంది -
భారతీయుడి పుర్రెను భారత్‌లోనే ఖననం చేయాలి!
లండన్: ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా విధులు నిర్వర్తించిన ఓ భారతీయుడి పుర్రెను.. అతని మాతృభూమిలోనే ఖననం చేయాలంటూ ఓ బ్రిటన్ చరిత్రకారుడు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13తో 99 ఏళ్లు గడిచిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరణించిన సైనికుడి పుర్రెకు ఇండియాలో దహన సంస్కారాలు జరిపించాలని కోరుతున్నాడు డాక్టర్ కిమ్ వాగ్నర్. కిమ్ లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014లో జలియవాలా బాగ్ గురించి ఓ బుక్ రాయడానికి పరిశోధన మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఉన్న ఆయనకు ఒక స్టోర్‌రూమ్‌లో ఒక పుర్రె దొరికింది. దాని కళ్ల భాగంలో ఆ పుర్రెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ కాగితం కనిపించింది. అది తెరిచి చూడగా దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన భారతీయ సైనికుడు ఆలం బాగ్ పుర్రె అని, ఇతను 32 సంవత్సరాల వయసువాడని, 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు కలిగి ఉన్నాడు. అంతేగాక అతని కుటుంబం మొత్తాన్ని స్కాటిష్ మిషనరీలు చంపేశాయని రాసి ఉంది. ఇది చదివిన కిమ్ మరింత అధ్యయనం జరిపి వాగ్నర్ ద స్కల్ ఆఫ్ ఆలం బాగ్( ద లైఫ్ ఆండ్ డెత్ ఆఫ్ ఏ రెబల్ ఆఫ్ 1857) పేరిట పుస్తకాన్ని రాసి విడుదలచేశారు. అంతటితో ఆగకుండా ఆలం బాగ్‌ను మాతృభూమి మట్టిలోనే పూడ్చిపెట్టాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ద్వారా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. -
‘ట్రై జంక్షన్’పై చైనా కన్ను
♦ భారతదేశ భద్రతకు ముప్పు ∙రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ♦ చర్చలతోనే పరిష్కారం.. ఇరు సైన్యాలు వెనక్కి మళ్లాలి ♦ రైతు సమస్యలపై రెండోరోజూ లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసన న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దుల్లో ట్రై జంక్షన్ వద్ద భూటాన్ భూభాగంపై ఆధిపత్యానికి చైనా ప్రణాళికతో ఉందని, అది భారతదేశ భద్రతకు ముప్పని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా విదే శాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సమాధాన మిస్తూ.. 2012లో డోక్లాంపై భారత్, చైనా, భూటాన్‌ల మధ్య లిఖితపూర్వక ఒప్పందం జరిగిందని, మూడు దేశాలు కలిసి ట్రై జంక్షన్ సరిహద్దుల్ని నిర్ణయించాలని అందులో పేర్కొ న్నారన్నారు. గతంలోనూ రోడ్ల నిర్మాణానికి చైనా ప్రయత్నించిందని, ఇప్పుడు ఏకంగా బుల్ డోజర్లు, ఇతర యంత్రాల్ని తీసుకొచ్చిం దని సుష్మ వెల్లడించారు. ట్రై జంక్షన్‌కు చేరుకుని దాన్ని ఏకపక్షంగా ఆధీనం లోకి తెచ్చుకోవాలన్నదే చైనా ఉద్దేశమని.. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ చైనాకు భూటాన్ లేఖ కూడా రాసిందని ఆమె తెలిపారు. ‘చర్చల ద్వారా వివాదం పరిష్కారాన్ని భారత్ కోరు తుంది. అయితే ముందుగా ఇరు దేశాలు తమ సైన్యాల్ని వెనక్కి పిలిపించాలి. డోక్లాం సరిహ ద్దు అంశంలో భారత్ అనవసరంగా తలదూర్చ లేదు.. మన దేశ వైఖరికి అన్ని దేశాలు మద్దతి స్తున్నాయి’ అని విదేశాంగ మంత్రి పేర్కొన్నా రు. మరోవైపు చైనాతో వివాదంపై విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అంశంపై భూటాన్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తు న్నామని వెల్లడించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హింస, హత్య లపై రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు ప్రధాని నరేంద్ర మోదీ యే కారణమని, అదే సమయం లో గోరక్షణ హత్యలపై ఆయన రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ తప్పుపట్టింది. గోరక్షకుల్ని అడ్డుకునేందుకు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ‘దళితులు, మైనార్టీలపై దాడులు, హత్యాచా రాల పెరుగుదల’ అంశంపై సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘2017లోనే ఎక్కువ హత్యలు చోటుచేసుకున్నాయి’ అని పేర్కొన్నారు. 2017లోనే ఇంత భారీ హింస ఎందుకు చోటుచేసుకుందని ప్రశ్నించారు. తన ప్రసంగా ల ద్వారా సెంటిమెంట్లను ప్రధాని మోదీ రెచ్చగొట్టారని సిబల్ ఆరోపించారు. అక్టోబర్ 8, 2015, ఆగస్టు 6, 2016, జూన్ 29, 2017ల్లో ప్రధాని చేసిన ప్రసంగాల్ని ఈ సందర్భంగా సిబల్ ప్రస్తావించారు. గోరక్షకుల అంశంలో నరేంద్ర మోదీ రాత్రి ఒకలా, పగలు మరోలా మాట మారుస్తున్నారని, మహాత్మా గాంధీ గురించి మోదీ తరచూ ప్రస్తావిస్తే సరిపోదని, ఆయన బాటలో నడవాలని సూచించారు. ‘గోరక్షక్ పవిత్ర సైన్యం’ ఏర్పాటుకు వీహెచ్‌పీ ప్రకటన చేయడంతో పాటు 2,700 మందిని నియమించుకుందని, వారికి బజరంగ్దళ్ శిక్షణ ఇచ్చిందన్నారు. మోదీ 49 దేశాలు సందర్శించారు మోదీ గత మూడేళ్లలో 49 దేశాల్లో పర్యటించారని విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. 2014 ద్వితీయార్థంలో ప్రధాని 8 దేశాల్లో పర్యటించినట్లు రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. గత 7 నెలల్లో 10 దేశాలను సందర్శించారు. ట్రంప్‌తో ‘హెచ్1బీ’ని చర్చించిన మోదీ న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీలో హెచ్1బీ వీసా అంశాన్ని మోదీ చర్చించారని రాజ్యసభలో సుష్మా తెలిపారు. భారత నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేస్తున్న సేవలను ఆ సందర్భంగా మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. వీసాలపై అమెరికా నియంత్రణలు విధించిన నేపథ్యంలో గురువారం సుష్మా స్వరాజ్ రాజ్యసభలో పలు ప్రశ్నలకు బదులిస్తూ...భారత నిపుణుల సేవలు ఇరు దేశాలకు లబ్ధిచేకూరుస్తున్నాయన్న సంగతిని ట్రంప్ అంగీకరించారని తెలిపారు. భారత వృత్తి నిపుణుల ప్రయోజనాలను దెబ్బతీస్తే అంతిమంగా అమెరికానే నష్టపోతుందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాల నిరసన రైతుల దుస్థితిపై చర్చించాలంటూ లోక్స భలో ప్రతిపక్షాలు సభా కార్యకలాపాల్ని స్తంభింపచేశాయి. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సభ వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. ఇంతలో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాం డ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలు కొనసాగిం చారు. బుధవారం రాత్రే ఈ అంశంపై చర్చ ముగిసిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్నారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు. తర్వాత సమావేశమ య్యాక.. కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదా లు మొదలుపెట్టారు. గందరగోళం మధ్య మరోసారి సభ వాయిదాపడింది. 12 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించారు. విపక్షాలు మాత్రం వెల్‌లోకి వచ్చి నిరసనను కొనసాగించాయి. గుట్కా స్కాంపై సీబీఐ విచారణ జరపాలని అన్నాడీఎంకేఎంపీలు వెల్‌లోకి దూసుకురావడంతో సభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు.